అన్‌లిమిటెడ్ కాల్స్, 14జీబీ డేటా
రిలయన్స్ జియో నుంచి తాజాగా జియో భారత్ 4జీ ఫోన్ (Jio Bharat 4G Phone) విడుదలైన సంగతి తెలిసిందే. అతి తక్కువ ధరకే ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో కంపెనీ ఈ ఫోన్ తీసుకొచ్చింది. ఇప్పటికీ 2జీలో ఉన్నవారిని దృష్టిలో పెట్టుకొని వారికి 4జీని పరిచయం చేసే ఉద్దేశంతో ఈ ఫోన్ తీసుకువచ్చింది. జియో భారత్ వీ2 4జీ పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. ధర కేవలం రూ.999 మాత్రమే. ఇంటర్నెట్ కనెక్టివిటీ, 4జీ నెట్ వర్క్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, టారిఫ్ ప్లాన్స్ లాంటి వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.
జియో భారత్ వీ2 4జీ ఫోన్ లో 1.77 అంగుళాల QVGA TFT డిస్‌ప్లే, 1000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఎఫ్ఎం రేడియో, 0.3మెగాపిక్సెల్ కెమెరా, హెడ్‌ఫోన్ జాక్, 128జీబీ వరకు స్టోరేజ్ సపోర్ట్, టార్చ్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ సపోర్ట్ లాంటివి ఉన్నాయి. ఈ ఫోన్‌లో జియోపే యాప్ ద్వారా సులువుగా యూపీఐ పేమెంట్స్ చేయడానికి అవకాశం ఉంది. జియో సినిమా యాప్ ద్వారా సినిమాలు, వీడియోలు, క్రీడలు చూడొచ్చు. జియోసావన్ యాప్ ద్వారా 8 కోట్లకు పైగా పాటలు వినే అవకాశం ఉంది.

వినియోగదారులకు రెండు రకాల ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. ఇతర కంపెనీలతో పోలిస్తే చాలా తక్కువ. డేటా కూడా 7 రెట్లు అదనంగా లభిస్తుంది. 28 రోజుల ప్లాన్ రీఛార్జ్ చేయడానికి రూ.123 చెల్లించాలి. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 0.5జీబీ డేటా చొప్పున 14జీబీ డేటా వాడుకోవచ్చు. ఇతర ఆపరేటర్లు అందించేవాటితో పోలిస్తే 30 శాతం తక్కువ ధరకే జియో దీన్ని అందిస్తోంది. ఏడాదికి రూ.1,234 చెల్లిస్తే ఏడాదంతా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 0.5జీబీ డేటా చొప్పున మొత్తం 168జీబీ డేటా ఇస్తోంది. ఇతర ఆపరేటర్లతో పోలిస్తే 25 శాతం తక్కువ ధరకే ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications