ఆ జిల్లా నుంచి ఏక్ నిరంజన్, సీఎం పదవి మాత్రమే, చంద్రబాబు మార్క్ రాజకీయం !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరడంతో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర సీఎం, రజనీకాంత్, చిరంజీవితో పాటు పలు పార్టీల నాయకులు, సినీరంగ ప్రముఖులు కొత్త ప్రభుత్వంలోని పెద్దలు అందరికి శుభాకాంక్షలు తెలిపి వారిని వేదిక మీదే స్వయంగా అభినందించారు.
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజక వర్గం నుంచి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుంగనూరులో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, తంబళపల్లె నుంచి పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. మిగిలిన అన్ని నియోజక వర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే విజయం సాధించాడంతో ఆ రెండు పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి.

అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు మాత్రమే సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. చిత్తూరు జిల్లాకు ఒక్క మంత్రి పదవికూడా రాలేదు. పలమనేరు నుంచి మాజీ మంత్రి ఎన్ అమరనాథ రెడ్డి విజయం సాధించారు. గతంలో అమరనాథ రెడ్డి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక పీలేరు నుంచి మాజీ సీఎం ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
చిత్తూరు జిల్లాలో అమరనాథ రెడ్డి, లేదా కిశోర్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి గ్యారెంటీ అని అందరూ అనుకున్నారు. అయితే చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు నుంచి ఒక్కరికి కూడా మంత్రి పదవి రాకపోవడంతో టీడీపీ నాయకులు నిరాశ చెందుతున్నారు. ఇక తిరుపతి నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా విజయం సాదించిన జంగాలపల్లె శ్రీనివాసులు కూడా జనసేన కోటాలో మంత్రి పదవి దక్కించుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారని తెలిసింది.
మొత్తం మీద చిత్తూరు జిల్లాలో చంద్రబాబు తప్పా మరెవ్వరూ మంత్రి పదవులు దక్కించుకోలేదు. అయితే సీఎంగా నేను ఉన్నాను కదా, మీకు ఏం కావాలో చెప్పండి చేస్తాను అని చంద్రబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారని తెలిసింది. మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు సీఎంగా ఉండటంతో మరెవ్వరికి మంత్రి పదవులు దక్కలేదు. చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇస్తారని తెలిసింది.
-
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
చంద్రబాబుకు జాతీయ పార్టీ నేత సవాల్: మణిపూర్ లా తయారవుతాయి -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..!












Click it and Unblock the Notifications