• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    రాజ‌కీయ పార్టీల‌తో స‌ర‌దాగా జాలీ..! నేత‌ల‌తో కామెడీ చేస్తున్న ఆలీ..!!

    |

    అమ‌రావ‌తి/ హైద‌రాబాద్ : నిత్యం కామెడీ చేస్తూ ఎదుటివాళ్ల‌ను నవ్వించే ప్ర‌ముఖ హాస్య న‌టుడు ఆలీ ప్ర‌స్తుతం కామెడీ చేయ‌కుండానే న‌వ్వు తెప్పిస్తున్నారు. తాను సీరియ‌స్ గా వేస్తున్న రాజ‌కీయ అడుగులు హాస్యాన్ని పండిస్తున్నాయి. రాజ‌కీయాల్లో ఆలీ ప్ర‌వ‌ర్త‌న మూడు హాస్య స‌న్నివేశాలు, ఆరు సంప్ర‌దింపులు అన్న‌ట్టు త‌యార‌య్యింది. రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఉబ‌లాట‌ప‌డుతున్న ఆలీకి దాని ఎంట్రీ, ఏ పార్టీ ఐతే ప్ర‌యాణం సాఫీగా సాగుతుందో ఎంపిక చేసుకోవ‌డంలో గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ట్టు తెలుస్తోంది. సీరియ‌స్ గా ఏదో ఒక పార్టీ కండువా క‌ప్పుకుని ప‌ని ప్రారంభించాల్సిన ఆలీ. పూట‌కో పార్టీ అదినేత‌ల‌ను క‌లుస్తూ నాన్ సీరియ‌స్ పాలిటీసియ‌న్ గా ముద్ర‌వేసుకుంటున్నాడు. దీంతో రాజ‌కీయాల్లో స‌ర‌దాగా జాలీ చేస్తున్న ఆలీ అంటూ ప్ర‌జ‌లు కామెడీగా చ‌ర్చించుకుంటున్నారు.

    ఆదిలోనే హాస్యం..! ఇక ఆలీ రాజ‌కీయ ప్ర‌యాణం మొత్తం కామెడీనే..!!

    ఆదిలోనే హాస్యం..! ఇక ఆలీ రాజ‌కీయ ప్ర‌యాణం మొత్తం కామెడీనే..!!

    ప్రముఖ హాస్యనటుడు ఆలీ రాజ‌కీయ ప్ర‌యాణం ఏ పార్టీ నుంచి ఉంటుందో, ఇపుడు గోళీ ఏ నేత‌కు వేస్తున్నాడో అనే అంశం ఉత్కంఠ‌ను రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇపుడు ఎక్కడ చూసినా ఆలీ వ్యవహారశైలిపైనే చర్చసాగుతోంది. మూడు ప్రధాన పార్టీల అధినేతలను వేరు వేరుగా కలవడం ప్రాధాన్యతాంశంగా మారింది. రెండు రోజుల కిందట ఆలీ వైకాపా అధినేత జగన్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఆయన వైసీపీలో చేరుతున్నట్లు విస్తృతంగా ప్రచారం సాగింది.

    అన్ని పార్టీల అధినేత‌ల‌ను క‌లిసిని ఆలీ..! హాస్యం పండిస్తున్న సంప్ర‌దింపులు..!!

    అన్ని పార్టీల అధినేత‌ల‌ను క‌లిసిని ఆలీ..! హాస్యం పండిస్తున్న సంప్ర‌దింపులు..!!

    జగన్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 9న ఆయన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో వైసీపీ కండువా కప్పుకుంటున్నట్లు ర‌క‌ర‌కాల కథనాలు వస్తున్నాయి. అయితే అనూహ్యంగా ఆయన అమ‌రావ‌తిలో ప్రత్యక్షమయ్యారు. ఆదివారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. సినీ నిర్మాత అశ్వినీదత్‌తో కలిసి ఆలీ చంద్రబాబును కలవడంతో ఆయన మనసు మార్చుకుని టీడీపీలోకి వెళుతున్నారేమోనన్న అనుమానాలు క‌లుగుతున్నాయి.

     ఫ్యాన్ వేగంతో సైకిలెక్కి టీ గ్లాస్ అందుకొనే ప్ర‌య‌త్నం..! ఫాన్స్ చెవిలో క‌మ‌లం పువ్వేనా..??

    ఫ్యాన్ వేగంతో సైకిలెక్కి టీ గ్లాస్ అందుకొనే ప్ర‌య‌త్నం..! ఫాన్స్ చెవిలో క‌మ‌లం పువ్వేనా..??

    అయితే మళ్లీ మధ్యాహ్నానికి అనూహ్యంగా ఆయన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. విజయవాడలోని పవన్‌ ఇంటికి వెళ్లి గంటసేపు తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ ఆలీని జనసేనాలోకి ఆహ్వానించినట్లు సమాచారం. అయితే పార్టీలో చేరిక విషయంపై త్వరలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఆలీ చెప్పినట్లు తెలుస్తోంది. సినీ రంగంలో హాస్యనటుడైన ఆలీ వాస్తవానికి టీడీపీకి, ఇటు పవన్‌కు చాల స‌న్నిహితంగా ఉంటారు. అనూహ్యంగా ఆయన జగన్‌ దగ్గరకు వెళ్లడంతో ఆయన వైసీపీలోకి వస్తున్నట్లు ప్రచారం సాగింది.

    ఇంత‌కీ ఆలీ చేసుంది కామెడీ రాజ‌కీయ‌మా..! సీరియ‌స్ కామెడీనా..!

    ఇంత‌కీ ఆలీ చేసుంది కామెడీ రాజ‌కీయ‌మా..! సీరియ‌స్ కామెడీనా..!

    కానీ ఇపుడు పరిస్థితి చూస్తే మాత్రం ఆలీ చివరకు పవన్‌తోనే కలిసి నడిచే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఆలీ ఇలా వరుసగా అన్ని రాజకీయ పార్టీల నేతలను కలవడం వెనుక ఏమైనా మ‌త‌ల‌బు ఉందా? అనే అనుమానాలు కూడా క‌లుగున్నాయి. స్వతహాగా హాస్యాన్ని పండించే ఆలీ జనంలో త‌న గురించి చర్చ జరిగేందుకు ఎమైనా రాజ‌కీయ కామెడీ చేస్తున్నారా? అనే అంశం పై అటు రాజ‌కీయ రంగంలో, ఇటు సీని ప‌రిశ్ర‌మ‌లో పెద్ద యెత్తున చ‌ర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    English summary
    Actually comedy actor, Ali is laughing at the comedy and now public laughs without having a comedy. The political footsteps he's seriously puts in comedy. Ali's behavior in politics is made up of three comedy scenes and six consultations.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more