సినిమాల్లోని జూనియర్ ఎన్టీఆర్ పెద్దకొడుకు; మహేష్‌బాబు సినిమాలో సితారతో కలిసి అభయ్‌రామ్?
ఒకప్పుడు సినిమా హీరోల మధ్య విపరీతమైన కాంపిటేషన్ తో పాటు కూడా విభేదాలు కూడా ఉండేవని చర్చ జరిగేది. ఇప్పుడు హీరోల మధ్య స్నేహబంధం ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఇప్పుడు హీరోలు, వాళ్ళ పిల్లలు కూడా చాలా కలిసిమెలసి ఉంటున్నారు. ఒకరి సినిమా ఫంక్షన్లకు ఇంకొకరు వచ్చి వారి ఫ్యాన్స్ కు మేమంతా ఒకటే అన్న సందేశాన్ని ప్రజెంట్ సినీ హీరోలు ఇస్తున్నారు.
ఇక తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సూపర్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ పెద్దకుమారుడు అభయ్ రామ్ ఇప్పుడు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ అరంగేట్రం చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అది కూడా మహేష్ బాబు కూతురు సితార తో కలిసి నటించబోతున్నాడని సినీ వర్గాలలో చర్చ జరుగుతుంది.

ఇప్పటికే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల పిల్లలు చాలావరకు అనేక సినిమాలలో నటించారు. ఒక్కొక్కరుగా వారి తండ్రుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని బాల నటులుగా ఎంట్రీ ఇస్తున్నారు. రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ కొడుకు, శాకుంతలంలో అల్లు అర్జున్ కుమార్తె అర్హ, సర్కారు వారి పాటలో మహేష్ బాబు కూతురు సితార ఇప్పటికే నటించారు.
ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇది తారక్ ఫ్యాన్స్ కు సంతోషం కలిగిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించబోయే కొత్త సినిమాతో అభయ్ రామ్ ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబుతో రాజమౌళి ఓ భారీ అడ్వెంచర్ సినిమా చేయబోతున్నారని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతుందని తెలుస్తుంది.
ఈ చిత్రంలో ఇంట్రడక్షన్ సీన్ దాదాపు 20 నిమిషాల పాటు ఉండనుందని ఇందులో జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్, సితారతో కలిసి నటించబోతున్నట్లుగా తెలుస్తుంది. వీరిద్దరూ అక్కా, తమ్ముడుగా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ మొదటిసారి సినిమాలలో కాలు పెట్టినట్టు అవుతుంది. ఇది నిజంగా ఫ్యాన్స్ కు పండుగ లాంటి వార్త.












Click it and Unblock the Notifications