వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్యం కేసు ఆగస్ట్ 11కు, కోర్టుకు వచ్చిన రామలింగరాజు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Judgement in Satyam case to be delivered on Aug 11
హైదరాబాద్: సత్యం కేసులో విచారణను ఆగస్టు 11కు తీర్పును వాయిదా వేస్తున్నట్లు హైదరాబాదులోని నాంపల్లి కోర్టు తెలిపింది. సత్యం కంప్యూటర్స్ కుంభకోణానికి సంబంధించిన ఈ కేసులో... రామలింగరాజు సహా పలువురు సోమవారం కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆగస్టు 11న తీర్పు తేదీని ప్రకటించే అవకాశముంది.

కాగా, సత్యం కుంభకోణం కేసు విచారణ ముగిసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సత్యం రామలింగరాజుతో పాటు ఇతర నిందితులను కోర్టు దోషులుగా నిర్దారించింది. ఈ కేసులో తీర్పును కోర్టు ప్రకటించనుంది. ఇది కోట్లాది రూపాయల కుంభకోణం కేసు ఇది. ఈ కేసు విచారణ గత ఐదేళ్లుగా సాగుతోంది.

తుది తీర్పును వెలువరించడానికి కోర్టు 216 మంది సాక్షులను విచారించింది. దాదాపు 3-38 పత్రాలను పరిశీలించింది. 2009 జనవరి 7వ తేదీన సత్యం కుంభకోణం కేసు వెలుగులోకి వచ్చింది. కోట్లాది రూపాయలను సర్దుబాటు చేసేందుకు సత్యం కంపెనీకి చెందిన ఖాతాలను తారుమారు చేశానని అప్పటి సత్యం కంప్యూటర్స్ చైర్మన్ రామలింగ రాజు అంగీకరించారు. ఇది ప్రపంచ కార్పోరేట్ ప్రపంచాన్ని దిమ్మతిరిగేలా చేసింది.

English summary
The designated special court is likely to pronounce the judgement in the Satyam case on August 11. The court deferred the date to August 11 on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X