జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ ను పట్టించుకోలేదంటే టీడీపీ భవిష్యత్ దబిది దిబిడే!!
చంద్రబాబు పేరెత్తితేనే తీవ్ర స్థాయిలో మండిపడే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయింది. ఇంకేం చంద్రబాబును ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్న రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా పెడుతున్న పోస్టులు సంచలనం సృష్టిస్తున్నాయి.
నిన్నటికి నిన్న బాబు అరెస్టుతో వీకెండ్ పార్టీ చేసుకుంటున్న సీనియర్ ఎన్టీఆర్ అంటూ సీనియర్ ఎన్టీఆర్ పాటను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పైన ఆసక్తికర ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. చంద్రబాబు నాయుడు ని అరెస్ట్ చేస్తే కనీసం జూనియర్ ఎన్టీఆర్ బాబు అరెస్టును కూడా ఖండించ లేదని పేర్కొన్నారు. అసలు దాని గురించే పట్టించుకోలేదని సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.

ఇక ఈ పరిణామంతో చంద్రబాబు, టీడీపీ భవిష్యత్తు దబిడి దిబిడే అని స్పష్టంగా రుజువైందని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అంతకుముందు హే చంద్రబాబు.. నిన్ను జైల్లో పడేసినందుకు మీ సూపర్ క్లోజ్ ఫిలిం ఇండస్ట్రీ సూపర్ బిగ్గీలు కూడా ఎవరూ సీరియస్ గా స్పందించలేదని పేర్కొని, వారెవరు చంద్రబాబును పట్టించుకోవడం లేదని సెటైర్లు వేశారు.
వారిని వెనకనుంచి కాదు ముందు నుంచి కత్తితో పొడిచేయాలి అని నీకు అనిపించడంలేదా అంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు. అంతకుముందు మరో పోస్టులో హాలీవుడ్ నుండి స్టీవెన్ స్పీల్‌బర్గ్ లాగా, సిద్ధార్థ్ లూథ్రా ఢిల్లీ నుండి వచ్చి మన రాజమౌళి కా బాప్, అడ్వకేట్ పొన్నవోలు సుధాకరెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోయాడని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు కోసం ఇది లీగల్ బాహుబలి అంటూ రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.

ఏదేమైనా చంద్రబాబు అరెస్ట్ ను, ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితిని తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ రాంగోపాల్ వర్మ టార్గెట్ చేయడం, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు అన్న ప్రస్తావన తీసుకురావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications