చిత్తూరు జిల్లా జల్లికట్టులో జూనియర్ ఎన్టీఆర్ సందడి .. ఎన్టీఆర్ అభిమానులా .. మజాకా!!

చిత్తూరు జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే సాంప్రదాయ జల్లికట్టు పోటీలలో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. అదేంటి జూనియర్ ఎన్టీఆర్ చిత్తూరు జిల్లా వెళ్ళారా? జల్లికట్టు వేడుకల్లో పాల్గొన్నారా ? అని ఆశ్చర్యపోకండి. చిత్తూరు జిల్లాలో జరిగిన జల్లికట్టు పోటీలలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో తన పౌరుషాన్ని చాటారు. జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో పోట్ల గిత్తలు సందడి చేశాయి. పౌరుషం తో ముందుకు దూకాయి.

 జల్లికట్టు పోటీలలో పాల్గొనే పోట్ల గిత్త లకు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు

జల్లికట్టు పోటీలలో పాల్గొనే పోట్ల గిత్త లకు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు

జల్లికట్టు పోటీలలో పాల్గొనే పోట్ల గిత్త లకు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను పెట్టి ఎన్టీఆర్ అభిమానులు మురిసిపోయారు. చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలం అనుప్పల్లి లో జరిగిన వేడుకలలో పోట్ల గిత్త లను అందంగా ముస్తాబు చేసిన వారు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను సైతం పెట్టి సందడి చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సహజంగా పొట్ల గిట్టలకు దేవుళ్ళ ఫోటోలు పెట్టి వాటిని బరిలోకి దింపి వాటిని నిలువరించి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో జరిగిన జల్లికట్టులో అభిమానులు జూనియర్ ఫోటోలను గిత్తలకు అలంకరించారు.

జూనియర్ ఎన్టీఆర్ పౌరుషం, పోట్లగిత్తలలో చూసుకుని మురిసిపోయిన ఎన్టీఆర్ అభిమానులు

జూనియర్ ఎన్టీఆర్ పౌరుషం, పోట్లగిత్తలలో చూసుకుని మురిసిపోయిన ఎన్టీఆర్ అభిమానులు

జూనియర్ ఎన్టీఆర్ పౌరుషం, పోట్ల గిత్తలలో చూసుకుని ఎన్టీఆర్ అభిమానులు తెగ సంబరపడ్డారు. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో సంప్రదాయబద్ధంగా జరిగే జల్లికట్టును చూడడం కోసం చాలా మంది యువత అనుప్పల్లికి చేరుకున్నారు. పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ రామచంద్రపురం మండలం అనుప్పల్లి లో జల్లికట్టు జరుగుతోంది . కరోనా నిబంధనలు బేఖాతరు చేస్తూ చిత్తూరు జిల్లాలో యువకులు పెద్ద సంఖ్యలో ఈ పోటీలో పాల్గొంటున్నారు .

 పోలీసుల ఆదేశాలు బేఖాతరు .. జోరుగా జల్లికట్టు పోటీలు

పోలీసుల ఆదేశాలు బేఖాతరు .. జోరుగా జల్లికట్టు పోటీలు

పోట్లగిత్తలను పట్టుకొని నిలువరించడం కోసం యువకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహం చూపిస్తున్నారు. జల్లికట్టు పోటీలు నిర్వహిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అవేవి పట్టించుకోకుండా జల్లికట్టు పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం జల్లికట్టులో పాల్గొనడం కోసం పెద్ద సంఖ్యలో యువత ఆసక్తిని కనబరుస్తారు. ఈ సంవత్సరం కూడా నెమలిగుంట్ల పల్లి , గంగిరెడ్డి పల్లి, ఉప్పుల వంక , యాపకుప్పం, చంద్రగిరి, బ్రాహ్మణపల్లి, చానంబట్ల , పాత చానంబట్ల గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు జల్లికట్టు వేడుకలలో పాల్గొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+