చంద్రబాబు మావయ్యా .. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్.. సాలిడ్ రిప్లై ఇచ్చిన చంద్రబాబు.. తారక్‌పై విమర్శలు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలలో టిడిపి జనసేన బిజెపి కూటమికి పట్టం కట్టారు. భారీ మెజారిటీని అందించి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఊహించిన దానికన్నా ఫలితాలు గొప్పగా రావడంతో చంద్రబాబుకు సినీ, రాజకీయ ప్రముఖుల నుండి ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా టిడిపి అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
మావయ్యా అంటూ చంద్రబాబుపై జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్
ఎక్స్ వేదికగా "ప్రియమైన నారా చంద్రబాబు నాయుడు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన శ్రీ భరత్ కి, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు" అంటూ ఆయన పోస్ట్ చేశారు.

సాలిడ్ రిప్లై ఇచ్చిన చంద్రబాబు
ఈ పోస్ట్ కు చంద్రబాబు సాలిడ్ రిప్లై ఇచ్చారు. ఒకే ఒక ముక్కలో థాంక్యూ అమ్మ అంటూ సమాధానమిచ్చారు. అధికారంలో లేనప్పుడు, రాష్ట్రంలో అష్ట కష్టాలు పడినప్పుడు, భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలతో అవమానాలకు గురి చేసినప్పుడు, చంద్రబాబును జైలుకు పంపించినప్పుడు కూడా ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడని, కనీసం మద్దతుగా ఒక పోస్ట్ కూడా పెట్టని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పోస్ట్ పెట్టడంపై మిశ్రమ స్పందన వస్తుంది.
జూనియర్ పోస్ట్ పై కొందరు ఇలా
కొందరు అధికారం రాగానే మామయ్య అంటూ వరుసలు కలుపుతున్నాడు అని, ఇలాంటి వాడిని దూరంగా ఉంచితేనే మంచిదంటూ జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు. కష్టాలలో ఉన్నప్పుడు కనీసం నేనున్నానని చెప్పలేనివాడు, ఇప్పుడు మామయ్య అంటే మాత్రం ఒరిగేదేమిటి అంటూ కొందరు అంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ పై తెలుగు తమ్ముళ్ళ ఆవేదన అందుకే
ఇంకొందరైతే ఇప్పటికైనా చంద్రబాబు విలువ తెలుసుకొని స్పందించాడు కదా.. పోనీలే మనవాడే అంటూ పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు అరెస్టు జరిగినప్పుడు, చంద్రబాబును జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టినప్పుడు, దేశమే కాదు ప్రపంచమంతా స్పందించిందని.. ఆ సమయంలో మీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్న అసంతృప్తి మినహాయించి జూనియర్ ఎన్టీఆర్ పై తమకు ఎలాంటి కోపం లేదని కొంతమంది చెబుతున్నారు. ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన పోస్ట్ దానికి చంద్రబాబు ఇచ్చిన సాలిడ్ రిప్లై ఇప్పుడు ఏపీలో ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications