జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు వదిలేసి వస్తే టీడీపీలో పదవిప్పిస్తా: పిఠాపురం వర్మ వ్యాఖ్యల దుమారం!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్న వేళ సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై పెద్ద ఎత్తున రచ్చ కొనసాగుతుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలతో రగడ మొదలైంది.

జూనియర్ ఎన్టీఆర్ పై పిఠాపురం వర్మ సెన్సేషన్
ఓ న్యూస్ ఛానల్ డిబేట్లో వర్మ జూనియర్ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావచ్చు అని, సినిమాలు మానేసి ఫుల్ టైం వస్తే పార్టీలో ఏదో ఒక పదవి ఇచ్చి కూర్చోబెడతామని పేర్కొన్నారు. లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ గురించి పోల్చి చూస్తున్నారని పేర్కొన్న వర్మ లోకేష్ కూడా జూనియర్ ఎన్టీఆర్ కు సముచిత స్థానం ఇస్తారన్నారు.

Junior NTR will give post in TDP if he quits movies SVSN Varma comments controversy NTR fans fire

లోకేష్ తో జూనియర్ ఎన్టీఆర్ కు పోలిక దేనికి
లోకేష్ తో జూనియర్ ఎన్టీఆర్ కు పోలిక ఏముందని ప్రశ్నించిన వర్మ లోకేష్ సిన్సియర్ గా పార్టీ కోసం పని చేస్తున్నారని ప్రజల కోసం పాదయాత్ర చేశారని, ఆయన ఆధ్వర్యంలో అరవై లక్షల సభ్యత్వాలు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. కార్యకర్తలు ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ ఇచ్చే విధానాన్ని కూడా లోకేష్ అమలు చేశారని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో లోకేష్ కీలకంగా మారారని పేర్కొన్న వర్మ ఎవరైనా సరే రాజకీయంగా పని చేస్తే గుర్తింపు వస్తుందన్నారు.

సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి రమ్మన్న వర్మ
భయపడి ఇంట్లో కూర్చుంటే కుదరదని వర్మ జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ కోసం త్యాగం చేసే ఉద్దేశం ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ని కూడా సినిమాలు వదిలేసి రమ్మని ఆయన స్వాగతించారు. నందమూరి హరికృష్ణకు రాజ్యసభ ఇచ్చారని, నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారని పేర్కొన్న వర్మ రాజకీయాల్లోకి రావాలని ఆ కుటుంబానికి లేని బాధ మిగతా వాళ్లకు దేనికంటూ ప్రశ్నించారు.

వర్మ ఆడియోపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం
ఇక వర్మ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్మకే ఏపీ టీడీపీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. నీకే టికెట్ లేదు నువ్వేం పదవి ఇప్పిస్తావ్ అంటూ వర్మపై సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ సినిమాలు మానేసి రాజకీయాల్లోకి రావాలని చెబుతున్నారని మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటూ ఇంకా సినిమాలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలని వారు ప్రశ్నించారు.

ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టిడిపి
ఇక లోకేష్ గురించి అంతగా చెబుతున్నారని, లోకేష్ పార్టీ కోసం ఏ పని చేశారని అసలు 2014 ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ని చేసి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టిడిపి అన్నట్టు వివాదం కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+