ప్రజాశాంతి పార్టీ రద్దు కాలేదు- అంతా ఫేక్ న్యూస్- ఏం జరిగిందంటే ? కేఏ పాల్ క్లారిటీ
ఏపీతో పాటు తెలంగాణలోనూ ప్రజాశాంతి పార్టీని విస్తరించేందుకు, ఎన్నికల్లో పోటీచేసేందుకు అధ్యక్షుడు కేఏ పాల్ సిద్దమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీని ఈసీ రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగించిందంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. దీనిపై పాల్ ఇవాళ క్లారిటీ ఇచ్చారు. దీన్నో ఫేక్ న్యూస్ గా ఆయన అభివర్ణించారు. అంతే కాదు అసలేం జరిగిందో కూడా చెప్పుకొచ్చారు.

ప్రజాశాంతి పార్టీ రద్దు
కేఏ పాల్ కు చెందిన ప్రాంతీయ పార్టీ ప్రజాశాంతి పార్టీని ఎన్నికల సంఘం తాజాగా తమ జాబితా నుంచి తొలగించినట్లు వార్తలు వచ్చాయి. కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 89 పార్టీల్ని తమ జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో కేఏ పాల్ పార్టీ ప్రజాశాంతిని కూడా తొలగించినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న కేఏ పాల్ కు భారీ షాక్ తగిలినట్లు కూడా మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై వెంటనే పాల్ కూడా స్పందించకపోవడంతో అదే నిజమని అంతా భావించారు. కానీ పాల్ ఇవాళ ఫేస్ బుక్ ద్వారా జనం ముందుకు వచ్చారు.

అంతా ఫేక్ అన్న పాల్
ప్రజాశాంతి పార్టీని ఈసీ తమ జాబితా నుంచి తొలగించినట్లు వచ్చిన వార్తల్ని పుకార్లుగా కేఏ పాల్ అభివర్ణించారు. ప్రజాశాంతి పార్టీ రద్దయినట్లు, ఈసీ జాబితా నుంచి తొలగించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని అంతా ఫేక్ గా పాల్ తెలిపారు. ఈ మేరకు ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన పాల్.. పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. ఇందులో అసలు ఈ ప్రచారం జరగడం వెనుక కారణాలు, ఎవరెవరు ఉన్నారనే దానిపై కేఏ పాల్ వివరాలు కూడా వెల్లడించారు. దీంతో జనం ఈ విషయంపైనా ఇప్పుడు చర్చించుకుంటున్నారు.
అసలేం జరిగిందంటే ?
ప్రజాశాంతి పార్టీని ఈసీ జాబితా నుంచి తొలగించలేదు సరే. మరి అలాంటప్పుడు ఈ ప్రచారం అంతా ఎలా జరిగింది ? ఈ విషయంపైనా పాల్ క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీ యాక్టివ్ గా లేకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని, ఈసీ తమ పార్టీ కార్యకలాపాలపై కొన్ని పత్రాలు కోరిందని, దాన్ని త్వరలో సమర్పిస్తామని పాల్ తెలిపారు. ఆలోపే తమ పార్టీ కూడా రద్దయిపోయిందని కుటుంబ పార్టీలు కొన్ని ప్రచారం చేస్తున్నాయని పాల్ ఆరోపించారు. గతంలో చంద్రబాబు, ఇప్పుడు వైఎస్ జగన్ కూడా తనను అడ్డుకునేందుకు పలు ఎత్తులువేశారని పాల్ విమర్శించారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications