కృష్ణా-గుంటూరు టీచర్స్ ఎమ్మెల్సీగా కల్పలత రెడ్డి విజయం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.
గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో కల్పలత విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బొడ్డు నాగేశ్వరరావుపై కల్వలత గెలుపొందారు.
విజయానికి కావాల్సిన 50 శాతం ఓట్లు దాటడంతో కల్పలత రెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. 6153 ఓట్ల దాటగానే కల్పలత విజయం సాధించారని తెలిపారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 6153 రాకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 6153 ఓట్లు సాధించడంతో కల్పలత గెలుపొందినట్లు ప్రకటించారు.

ఎమ్మెల్సీగా గెలిచిన సందర్భంగా కల్పలత మీడియాతో మాట్లాడారు. తన విజయం కోసం కృషి చేసినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పారు. మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను స్థానికురాలిని కాదనే అభిప్రాయం ఎక్కడా వ్యక్తం కాలేదని కల్పలత వ్యాఖ్యానించారు.
కాగా, ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సమీప ప్రత్యర్థి నారాయణ రావుపై ఆయన 1537 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. షేక్ సాబ్జీకి 7983 ఓట్లు రాగా, నారాయణకు 6446 ఓట్లు వచ్చాయి.
-
సడన్ గా లబ్దిదారుల అకౌంట్ లో రూ.2,000 జమ: పింఛన్ + బోనస్ -
కీలక మలుపు తిరిగిన ఇరాన్ యుద్ధం.. చైనా ఎంట్రీ! -
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!! -
నా ఆస్తులు చూసి నేనే షాకయ్యా: తనికెళ్ల భరణి సెటైర్లు! -
నన్ను బలిపశువును చేస్తున్నారు! -
T20 World Cup Final: సౌతాఫ్రికాతో పైనల్ వీళ్లకే- పాక్ మాజీ కెప్టెన్ జోస్యం..! -
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
ఇరగదీశావ్ పో..: రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ మెగాస్టార్ ఫిదా -
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త పథకం అమల్లోకి..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
ఓటీటీలోకి కిర్రాక్ కామెడీ మూవీ.. పొట్టు పొట్టు నవ్వుకోండి..! -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..!












Click it and Unblock the Notifications