సెంట్రల్ జైలులోనే స్టార్ హీరో, బెయిల్ పిటిషన్ విచారణలో ట్విస్ట్
కన్నడ చాలెంజింగ్ స్టార్ దర్శన్ బెయిల్ పిటిషన్ విచారణ మరోసారి వాయిదా పడింది. ఈరోజు సోమవారం హీరో దర్శన్ కు బెయిల్ వస్తుందని ఆయన అభిమానులు వెయ్యికళ్లతో ఎదురు చూశారు. అయితే హీరో దర్శన్ బెయిల్ పిటిషన్ వాయిదా వేయాలని ఆయన తరపు న్యాయవాదులే కోర్టుకు మనవి చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. హీరో దర్శన్ బెయిల్ పిటిషన్ పదే పదే వాయిదా పడుతుండడంతో ఆయన అభిమానులు అయోమయంలో పడిపోయారు.
రేణుకస్వామి హత్య కేసులో అరెస్టు అయిన హీరో దర్శన్ సెంట్రల్ జైలుకు వెళ్లి వంద రోజులకుపైగా అయ్యింది. హీరో దర్శన్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. హీరో దర్శన్ ను బెయిల్ పై బయటకు తీసుకురావాలని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనెల 27వ తేదీన హీరో దర్శన్ బెయిల్ పిటిషన్ విచారణ జరగవలసి ఉంది. అయితే ఇదే నెల 30వ తేదీకి హీరో దర్శన్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది.

ఈరోజు హీరో దర్శన్ కి కచ్చితంగా బెయిల్ వస్తుందని ఆయన అభిమానులు అనుకున్నారు. బెంగళూరులోని 57వ సెషన్స్ కోర్టులో హీరో బెయిల్ పిటిషన్ విచారణ జరిగింది. హీరో దర్శన్ కు బెయిల్ మంజూరు చేయకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్న కుమార్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించడానికి తమకు సమయం కావాలని హీరో దర్శన్ తరపు న్యాయవాదులు కోర్టుకు మనవి చేశారు.
దర్శన్ న్యాయవాదులు పదేపదే వాయిదాలు అడుగుతున్నారని, దర్శన్ బెయిల్ పిటిషన్ కొట్టేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్న కుమార్ కోర్టుకు మనవి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి అక్టోబర్ 4వ తేదీకి దర్శన్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేశారు. హీరో దర్శన్ తరపు సీనియర్ న్యాయవాదులు సోమవారం వాదనలు వినిపించడానికి కోర్టుకు హాజరు కాలేదని, దర్శన్ బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించడానికి జూనియర్ న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారని హీరో సన్నిహితులు అంటున్నారు .
హీరో దర్శన్ బెయిల్ పిటిషన్ పదేపదే వాయిదా పడుతుండటంతో ఆయన అభిమానులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీన హీరో దర్శన్ కి కచ్చితంగా బెయిల్ వస్తుందని ఆయన అభిమానులు అంటున్నారు. చిత్రదుర్గ నివాసి రేణుకస్వామి హత్య కేసులో ఎ2 ఆరోపి అయిన హీరో దర్శన్ అరెస్టు అయ్యి వంద రోజులకు పైగా అయ్యింది. హీరో దర్శన్ ను బెయిల్ మీద బయటకు తీసుకురావాలని ఆయన భార్య విజయలక్ష్మి తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, హీరో సన్నిహితులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications