కనుమ ఎఫెక్ట్.. చికెన్, మటన్, చేపలు, దిమ్మతిరిగే ధరలు!

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక నిన్న సంక్రాంతి పండుగ జరగగా నేడు కనుమ పండుగను జరుపుకుంటున్నారు. ఒకపక్క కనుమ రోజు పశువులకు పూజ చేస్తూనే, మరోవైపు చికెన్, మటన్ వండుకొని లాగిస్తున్నారు. దీంతో కనుమ పండుగ నాడు చికెన్, మటన్ ధరలకు రెక్కలు వచ్చాయి.

భారీగా పెంచేసిన మటన్ ధరలు
నాన్ వెజ్ తినేవారికి చికెన్, మటన్ షాపుల వద్ద ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణ రోజుల్లో మటన్ ధర ఎనిమిది వందల రూపాయల పైన ఉంటే, ఇక నేడు కనుమ సందర్భంగా ఒక్కసారిగా ధరను పెంచేశారు. మటన్ దుకాణదారులు కిలో మటన్ ధర వెయ్యి రూపాయలకు అమ్ముతున్న పరిస్థితి అనేక చోట్ల కనిపిస్తుంది.

Kanuma effect Chicken mutton fish prices skyrocketing

చికెన్ ధరల బాదుడు.. దుకాణాల వద్ద క్యూ
ఈరోజు ఉదయం చికెన్ షాప్స్ వద్ద కూడా ఎక్కడ చూసినా భారీగా జనాలు క్యూ కట్టిన పరిస్థితి కనిపించింది. ఇక చికెన్ ధరలు కూడా కేజీ 250 నుంచి 300 రూపాయలు వరకు అమ్ముతున్నారు . విడిరోజులతో పోలిస్తే పండుగ రోజులు కాబట్టి ధరలు విపరీతంగా పెంచి దుకాణదారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈరోజు ఉదయం 4గంటల సమయం నుంచే మటన్, చికెన్ కోసం ప్రజలు దుకాణాల ముందు క్యూ కట్టారు.

నాటు కోళ్ళు, చేపలు.. వేటినీ వదలకుండా ధరల పెంపు
కనుమ పండుగకు దాదాపు అందరూ నాన్ వెజ్ వండుకొని తినేందుకు ఆసక్తి చూపిస్తారు. కాబట్టి చికెన్, మటన్ షాప్ ల వద్ద పబ్లిక్ రష్ ఎక్కువగా ఉంది. ఇక చాలామంది నాటు కోళ్లను కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. కేజీ నాటుకోడి 900 రూపాయలు ఉన్నా సరే కొనుగోలు చేస్తున్నారు. ఇక మరోవైపు చేపల మార్కెట్లో కూడా భారీగా జనాలు చేపలను కొనుగోలు చేస్తున్నారు.

ఊహించని గిరాకీ, విక్రయాల జోరుతో దుకాణాలు ఖాళీ
మామూలు బొచ్చ, రవ్వ వంటి చేపలు కూడా కిలో రెండు వందల రూపాయల పైనే చెబుతున్న పరిస్థితి ఉంది. ఇక కొన్ని చోట్ల అయితే ఇప్పటికే దుకాణాలలో ఉన్న కోళ్లు, గొర్రెలు అమ్మేసి దుకాణాలను కూడా క్లోజ్ చేశారు. తాము అంచనా వేసుకున్న దానికంటే ఎక్కువ మంది జనాలు వస్తున్నారని, ఇంత డిమాండ్ ఉంటుందని తాము ఊహించలేదని దుకాణం దారులు చెబుతున్నారు. మొత్తానికి నాన్ వెజ్ ప్రియులు కనుమ రోజు నాన్ వెజ్ వంటకాలతో పండుగ చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+