వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదీ పవన్ కళ్యాణ్: అందరిలా కాదు.. 'కాటమరాయుడు' మరో కోణం!

పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా వస్తున్న 'కాటమరాయుడు' సినిమా టైటిల్ సాంగ్ అదిరిపోయింది. శుక్రవారం నాడు సాయంత్రం టైటిల్ సాంగ్ విడుదల చేశారు. దీనిని పెద్ద ఎత్తున వ్యూస్ వస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విజయవాడ: పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా వస్తున్న 'కాటమరాయుడు' సినిమా టైటిల్ సాంగ్ అదిరిపోయింది. శుక్రవారం నాడు సాయంత్రం టైటిల్ సాంగ్ విడుదల చేశారు. దీనిని పెద్ద ఎత్తున వ్యూస్ వస్తున్నాయి.

మరో ఇరవై రోజుల్లో సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో దుమ్మరేపే టైటిల్ సాంగ్ విడుదల చేశారు.

<strong>కొత్త మలుపు: 'కలెక్టరే జగన్ చొక్కా పట్టుకొని లాగారు, ఆధారాలతో కోర్టుకు'</strong>కొత్త మలుపు: 'కలెక్టరే జగన్ చొక్కా పట్టుకొని లాగారు, ఆధారాలతో కోర్టుకు'

టైటిల్ సాంగ్ వింటుంటే అందులో పొలిటికల్ యాంగిల్ కనిపిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి నాలుగేళ్లు అవుతోంది. 2019లో ఆయన పోటీకి సిద్ధమవుతున్నారు.

ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిగా పార్టీపై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ఆయన ప్రధాన ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. ఉద్ధానం, చేనేత, భూసేకరణ వంటి అంశాలను లేవనెత్తారు.

హోదా నుంచి..

హోదా నుంచి..

ప్రత్యేక హోదా నుంచి ఉద్ధానం కిడ్నీ సమస్యల వరకు ఆయన పర్యటించి, నిలదీశారు. సమస్యలపై నిలదీయడం, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ ప్రకటించడం వంటి ఎన్నో పరిణామాలు చేసుకున్నాయి.

ఇలాంటి సమయంలో కాటమరాయుడు టైటిల్ సాంగ్ విడుదలయింది. పాట కేవలం సినిమా కోసమే రాశారో లేక మరే ఉద్దేశ్యంతోనైనా రాశారో తెలియదు కానీ, ఆ పాట తీరులో మాత్రం పొలిటికల్ కోణం కనిపిస్తోందని అంటున్నారు.

నాయకుడు.. సేవకుడు

నాయకుడు.. సేవకుడు

నాయకుడై నడిపించేవాడని, సేవకుడై నడుం వంచేవాడని, అందరికోసం అడుగేశాడని పాటలో ఉంది. జనం కోసం మీసం మెలితిప్పుతాడని, కండల్లోని రోషం జనం కోసమే పోటెత్తుతుందని పాటలో ఉంది.

సూరీడల్లే వచ్చాడని, కాటమరాయుడు అందరివాడని, మంచితనానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పారు. ఒక్కడైనా అనేక రకములు కలవాడని, యే రంగుతో చూస్తే ఆ రంగుగా కనిపిస్తాడని, తలవంచని వాడని ఉంది. అంతేకాదు, మా చెడ్డ మంచోడు అని కాటమరాయుడు గురించి చెప్పారు.

పాటలో కనిపించినట్లుగానే పవన్ కళ్యాణ్ నిజ జీవితంలోను, ఇంకా ముఖ్యంగా రాజకీయ జీవితంలో కనిపిస్తున్నారని చెబుతున్నారు.

అందరిలా కాదు..

అందరిలా కాదు..

తాను జనసేన పార్టీ స్థాపించింది ప్రజల కోసమని, తనకు అధికారం అవసరం లేదని పవన్ పలుమార్లు చెప్పారు. సమస్యల పైన స్పందిస్తానని చెప్పి, ఆ మాట పైనే నిలబడ్డారు. ప్రజలకు సేవ చేసేందుకు అధికారమే ఉండాలని తాను భావించనని కూడా పవన్ చెప్పారు. ఇదే అర్థం పాటలోను కనిపిస్తోందంటున్నారు. నాయకుడై నడిపించేవాడని, కానీ సేవకుడిలా ఉంటాడని పాటలో ఉంది.

ఇప్పుడు ప్రత్యేక హోదా సహా పలు అంశాలపై ఆయన స్పందిస్తున్నారు. జనం కోసం మీసం తిప్పడం, జనం కోసం కండల్లోని రోషం పోటెత్తుతుందని చెప్పడం కూడా దీనికి దగ్గరగా ఉంది.

పవన్‌లోని ఆవేశం

పవన్‌లోని ఆవేశం

ఇక, పవన్ కళ్యాణ్‌ను చాలామంది ఆవేశపరుడిగా చెబుతారు. ఆ ఆవేశంలో అర్థం ఉందని చాలామంది నమ్ముతారు.

2014 ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా కోసం పవన్ బీజేపీ - టీడీపీ కూటమికి మద్దతిచ్చారు. ఈ హోదా కోసం ఆయన దాదాపు రెండేళ్లు వేచి చూశారు. ఆ తర్వాత తాను ఎవరికైతే మద్దతిచ్చాడో... అదే పార్టీల పైన తిరుగుబాటు చేస్తున్నారు. బీజేపీ, టీడీపీలపై ఘాటుగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

మంచి కోసం.. ఎదురు తిరిగితే..

మంచి కోసం.. ఎదురు తిరిగితే..

తమకు మద్దతుగా నిలిచినప్పుడు.. పవన్ రాజకీయ అనుభవం గురించి బీజేపీ అడగలేదు. కానీ ఇప్పుడు మాత్రం అడుగుతోంది. తాను నిలదీస్తున్నందున ఇప్పుడు తన రాజకీయ అనుభవం గురించి అడుగుతున్నారని స్వయంగా జనసేన అధినేత చెప్పారు. ఏపీకి మంచి జరిగేందుకు పవన్ నిలదీస్తుంటే బీజేపీ ఆయనను తప్పుబట్టడంపై పలువురు మండిపడ్డారు.

మంచి కోసం నిలదీస్తే..

మంచి కోసం నిలదీస్తే..

మెగా సోదరులు చిరంజీవి, నాగబాబు సహా చాలామంది పవన్‌కు ఆవేశం ఎక్కువ అని, కానీ అందులో అర్థం ఉంటుందని, ప్రజల కోసం ఆలోచిస్తాడాని చెబుతుంటారు. టిడిపి, బీజేపీని నిలదీయడంలో అర్థముందని చెప్పారు. అంటే మంచి కోసం ఎవరినైనా నిలదీస్తాడని చెప్పారు. ఈ మాటలతోనే పవన్ మా చెడ్డ మంచోడు అని అర్థమవుతోందని అంటున్నారు.

English summary
Katamarayudu title song released: Political angle!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X