వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలిచ్చారు: అధిష్టానంపై కావూరి నిప్పులు, ఏ పార్టీలోకి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavuri lashes out at High Command
న్యూఢిల్లీ: రాజకీయ లబ్ది కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేశారని అధిష్టానంపై కేంద్ర జౌళీశాఖ మంత్రి కావూరి సాంబశివ రావు మండిపడ్డారు. మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ మూర్ఖంగా విభజన నిర్ణయం తీసుకుంద్నారు. విభజన పాపం అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీలదే అన్నారు.

తాము రాజీనామా చేసినా విభజన ఆగేది కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలను నమ్మి అధిష్టానం తమని బలి తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. అయితే ఏ పార్టీ తరపున అనేది ఇప్పుడే చెప్పలేనని తెలిపారు.

ప్రజాభీష్టం మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌లో తెరాస విలీనం కాదని తాను ముందే చెప్పానని, తమ మాటను అధిష్టానం పట్టించుకోలేదన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ సర్వనాశనమైందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే కేంద్రంలోనూ రాదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవమానకర సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కేంద్ర నాయకత్వంలో మార్పులు రావాలని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెసు ఎన్నికల కమిటీ భేటీ

సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మంగళవారం ఉదయం సమావేశమైంది. లోకసభ అభ్యర్థుల తొలిజా బితాపై ఈ సమావేశంలో కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

English summary
Union Minister Kavuri Sambasiva Rao on Tuesday lashed out at Congress Party High Command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X