తెలంగాణా సీఎంలుగా.. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ చంద్రబాబు శిష్యులే!!
ఎంతోమంది అమరుల త్యాగాల ఫలితంగా, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలన గత పదేళ్ల కాలంగా కెసిఆర్ చేతిలో ఉంటే, ఇప్పుడు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారణమైన రేవంత్ రెడ్డి చేతిలోకి మారింది. ఇక ఈ సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల రాజకీయాలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ మినహాయించి మిగతా పార్టీలు చాలా కాలం వరకు అస్తిత్వాన్ని కోల్పోయాయి. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించడంతో ఆయన తెలంగాణ రాష్ట్రం పైన పెద్దగా ఫోకస్ చేయలేదు. ఈ పరిణామాలతో టిడిపి తెలంగాణలో కుదేలైంది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పూర్తిగా ప్రభావాన్ని కోల్పోయింది.

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోని వారు చాలామంది టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని వెళ్లిపోయారు. రేవంత్ రెడ్డి, సీతక్క వంటి నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఇక తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ తన మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన నేతలకు అవకాశం కల్పించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సత్యవతి రాథోడ్ వంటి వారికి కెసిఆర్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. వీరంతా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారే. వీరంతా బాబు శిష్యులే. అయితే వీరు మాత్రమే కాదు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వర్తించిన కెసిఆర్ కూడా చంద్రబాబు శిష్యుడే.
ఇక ఇదే విషయాన్ని చంద్రబాబు గతంలో అనేకమార్లు కూడా ప్రస్తావించారు .టిడిపి లేకపోతే కేసీఆర్ ఉండేవాడా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. గురువుకి పంగనామాలు పెట్టిన ఘనుడు కెసిఆర్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ చంద్రబాబు శిష్యుడే.
ఇప్పుడు అధికారం మారి కాంగ్రెస్ పార్టీ నుండి పాలనా పగ్గాలు చేపట్టబోతున్న రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు శిష్యుడు కావడం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. తెలంగాణ మొదటి సీఎం ఆయన శిష్యుడే, తెలంగాణ రెండవ సీఎం కూడా చంద్రబాబు శిష్యుడని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఓ శిష్యుడు గురువుకు పంగనామాలు పెడితే, మరో శిష్యుడు గురువుకు విధేయంగా పని చేస్తారని కూడా జనాలు చర్చిస్తున్నారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications