Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీకి మద్దతిచ్చిన బీఆర్ఎస్ - పార్లమెంటులో ఆసక్తికర పరిణామం-ఇదే తొలిసారి ?

బీజేపీపై కోపంతో జాతీయ పార్టీ స్ధాపించిన కేసీఆర్.. ఇప్పుడు పలు ప్రాంతీయ పార్టీల్ని కలుపుకుని కేంద్రంపై పోరుకు సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో ఏపీలోనూ ఎంట్రీకి ప్రయత్నిస్తున్న కేసీఆర్ పార్టీ.. ఇవాళ వైసీపీకి మద్దతు తెలిపింది

తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిస్ధితుల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు తన సొంత పార్టీ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన సీఎం కేసీఆర్.. ఏపీలోనూ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలో విశాఖలో భారీ సభ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ద్వారా ఘనంగా ఎంట్రీ ఇవ్వాలని కేసీఆర్ సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీతో అంటకాగుతున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ మద్దతు కోరుతారా లేదా అనే దానిపై సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ పార్లమెంటులో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

పార్లమెంటు సమావేశాలకు ముందు కేంద్రం ఏర్పాటు చేసే అఖిలపక్ష భేటీలో వైసీపీతో పాటు బీఆర్ఎస్ కూడా పాల్గొంది. వైసీపీ తరఫున ఎంపీ విజయసాయిరెడ్డి తన డిమాండ్లను వినిపించారు. ఇందులో భాగంగా ఎప్పటి నుంచో మూలనపడిన ఓ డిమాండ్ ను తెరపైకి తెచ్చి కేంద్రాన్ని నెరవేర్చాలని కోరారు. ఇందుకు జాతీయ స్ధాయిలో కీలకంగా ఉన్న మూడు పార్టీల నుంచి మద్దతు లభించింది. ఇందులో కేసీఆర్ బీఆర్ఎస్ తో పాటు ఒడిశా అధికార పార్టీ బీజేడీ, పశ్చిమబెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కూడా ఉన్నాయి.

kcrs brs supported ys jagans ysrcp first time in all party meet- here are details

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలోని పార్లమెంటు ఎనెక్స్ లో అఖిలపక్ష భేటీ జరుగుతోంది. అఖిలపక్ష భేటీలో ఆమ్ ఆద్మీ పార్టీ అదానీ గ్రూప్ నష్టాలకు కారణమవుతున్న హిండెన్ బర్గ్ రిపోర్ట్ ను ప్రస్తావించింది. ఆ తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మోక్షం కల్పించాలని కేంద్రాన్ని కోరారు. వైసీపీ డిమాండ్ కు బీజేడీ, బీఆర్ఎస్, టీఎంసీ ఎంపీలు మద్దతు తెలిపారు. దీంతో వైసీపీ డిమాండ్ పై కేంద్రం తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు సామాజిక, ఆర్ధిక స్ధితిగతులతో కుల గణన చేయాలని వైసీపీ మరో డిమాండ్ కూడా వినిపించింది. బీసీల సామాజిక, ఆర్దిక డేటా ఆధారంగా ఆయా కులాలకు రిజర్వేషన్లు,సంక్షేమ ఫలాలు అందిచవచ్చని వైసీపీ తెలిపింది. అలాగే రైతు సమస్యల్నీ ప్రస్తావించినట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+