అద్భుతంగా ఫిల్మ్ సిటీ, బోర్డులో హీరో కృష్ణ: కెసిఆర్

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో నాలుగు వేల ఎకరాల్లో అద్భుతమైన ఫిలిం సిటీనిన నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. ఫిలిం సిటీ బోర్డులు హీరో కృష్ణను సభ్యుడిగా నియమిస్తామని ఆయన చెప్పారు. కృష్ణ అనుభవాలను ఫిలిం సిటీ అభివృద్ధికి వాడుకుంటామని చెప్పారు.

ఫిలిం సిటీకి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పేరు పెడితే బాగుంటుందని సూపర్ స్టార్ కృష్ణ అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కెసిఆర్ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన కొనియాడారు.

KCR said that Film city will be buily 4 thousand acres in Hyderabad

పేదలకు మెరుగైన వైద్యం అందించే విధంగా ఆస్పత్రులు పనిచేయాలని కెసిఆర్ అన్నారు. హైదరాబాదులోని గచ్చిబౌలిలో గల ఇంటర్ కాంటినెంటల్ ఆస్పత్రిలో ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ కేర్ సెంటర్‌ను ఆయన శనివారంనాడు ప్రారంభించారు. క్యాన్సర్ సెంటర్‌లో ఎన్నో అధునాతన సదుపాయాలున్నాయని ఆయన అన్నారు.

ఈ ఆస్పత్రి ఎంతో మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని ఆయన చెప్పారు. కాంటినెంటల్ బ్రాండ్ అంబాసిడర్‌గా తానే ఉంటానని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ఆస్పత్రి ఉందని ప్రశంసించారు. హైదరాబాద్ హెల్త్, మెడికల్, ఇండస్ట్రీ, టూరిస్ట్ హబ్‌గా రూపు దిద్దుకుంటుందని, అలా చేస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+