కేశినేని నానికి తమ్ముడు చిన్ని కౌంటర్- 99 నుంచీ మా గొడవ-టీడీపీకి నష్టమేం లేదు..!
విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరడం ఖాయమైపోయింది. నిన్న సీఎం జగన్ తో సమావేశం తర్వాత ఈ విషయాన్ని ప్రకటించిన నాని.. అదే సమయంలో టీడీపీపై, అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలకు దిగారు. చంద్రబాబు మోసగాడంటూ ఆరోపించారు. తన కుటుంబంలో చిచ్చుపెట్టారని కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలో కేశినేని నాని చేసిన విమర్శలపై ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన ఆయన సోదరుడు కేశినేని చిన్ని ఇవాళ స్పందించారు.
Recommended Video

నిన్న సీఎం జగన్ తో భేటీ తర్వాత కేశినేని నాని చేసిన విమర్శలపై స్పందించిన ఆయన సోదరుడు కేశినేని చిన్ని .. కౌంటర్ ఇచ్చారు. తమ కుటుంబ కలహాలు 1999 నుంచీ ఉన్నాయని, వీటికి చంద్రబాబుకు ఏం సంబంధం అని ప్రశ్నించారు.నాని తనను ఎన్ని అన్నా 1999 నుంచి తాను సర్దుకుపోతూనే ఉన్నానని చిన్ని గుర్తుచేశారు. అసలు నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్ధాయి కేశినేని నానికి లేదన్నారు.

చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్ష మరిచి మాట్లాడటం తగదని సోదరుడు కేశినేని నానికి కేశినేని చిన్ని హితవు పలికారు. ఎంతో మంది మహామహులు తెలుగుదేశాన్ని వీడినా పార్టీకేం కాలేదని గుర్తుచేశారు. వచ్చే వాళ్లు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారున్నారు. ఇప్పటి వరకూ తెలుగుదేశం ని ఎవరూ ఏం చేయలేకపోయారన్నారు. తద్వారా కేశినేని నాని వైసీపీలోకి వెళ్లడం వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని ఆయన చెప్పుకొచ్చారు. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్ధి రేసులో ఉన్న చిన్ని చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
కుటుంబం పరువు తీస్తావా - కేశినేని నాని పై చిన్ని ఫైర్..!!#KesineniChinni #KesineniNani #YSJagan #TDP #YSRCP #AndhraPradesh #Oneindaitelugu pic.twitter.com/DOcDEDLE6m
— oneindiatelugu (@oneindiatelugu) January 11, 2024












Click it and Unblock the Notifications