Kesineni Nani: హ్యాట్రిక్ వేటలో కేశినేని నాని ముందున్న సవాళ్లివే ?

ఏపీలో ఎన్నికల వేళ టికెట్లు దక్కని వారు పార్టీలు మారిపోతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ జాబితాలో ఉన్నారు. అయితే వీరంతా ఓ ఎత్తు. విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం మరో ఎత్తు. రాజకీయంగా, కులపరంగా పలు సమీకరణాల మధ్య వరుసగా రెండుసార్లు బెజవాడలో గెలిచిన ఆయన.. ఇప్పుడు అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ఉన్న వైసీపీలో చేరారు. దీంతో ఈ సమీకరణం మరింత క్లిష్టంగా మారిపోయింది.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అనంతరం టీడీపీలో చేరి రెండుసార్లు 2014, 2019లో ఎంపీగా గెలిచిన చరిత్ర కేశినేని నానిది. కమ్మ సామాజిక వర్గ నేతల్ని మాత్రమే ఎంపీగా గెలిపిస్తూ వస్తున్న విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో గతంలో అయితే కమ్యూనిస్టులు, లేదంటే టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు ఎంపీలుగా గెలిచారు. కమ్మ సామాజిక వర్గ ఓటింగ్ తో పాటు సంపూర్ణ మద్దతు తెచ్చుకునే నేతలే ఇక్కడ ఎంపీలుగా గెలుస్తున్నారు. కేశినేని కూడా ఇందుకు అతీతం కాదు.

Kesineni Nani lone fight for hat-trick in vijayawada amid these key challenges

2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా టీడీపీ గెల్చుకున్న మూడు ఎంపీ సీట్లలో శ్రీకాకుళం, గుంటూరుతో పాటు విజయవాడ కూడా ఉంది. ఇక్కడ ప్రత్యర్ధి పీవీపీని కేవలం 8700 ఓట్లతో ఓడించి కేశినేని గట్టెక్కారు. కానీ ఇప్పుడు ఆ పరిస్ధితుల్లేవు. అదే సమయంలో గత పదేళ్లలో నగరంలో కేశినేని చేసిన అభివృద్ధి ఆనవాళ్లు ఫ్లైఓవర్ల రూపంలో కనిపిస్తున్నాయి. కానీ గత నాలుగేళ్లలో సొంత పార్టీ నేతల నుంచే ప్రతిఘటన ఎదురుకావడంతో ఆయన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువగా తిరగలేకపోయారు.

ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా కేశినేని నాని సోదరుడు చిన్నికి టికెట్ దాదాపు ఖరారైంది. అలాగే వైసీపీ నుంచి కేశినేని నానికి టికెట్ ఖరారైంది. అంటే కేశినేని బ్రదర్స్ కుటుంబ పోరు ఖాయం. ఈ పోరులో కమ్మ సామాజిక వర్గ ఓట్లు భారీగా చీలిపోవడం ఖాయం. అలాగే వైసీపీకి అమరావతి ప్రాంతంలో ఉన్న వ్యతిరేకత ప్రభావం కచ్చితంగా కేశినేని నానిపై పడటం ఖాయం. అదే సమయంలో విజయవాడలో తాను చేసిన అభివృద్ధి కేశినేని నానికి ప్లస్ కావడం కూడా ఖాయమే. చివరిగా టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లిన నానికి మద్దతుగా కేవలం ఎస్సీ నేత నల్లగట్ల స్వామిద్వాస్ మినహా మరే నేత కూడా వెళ్లలేదు. ఇన్ని సమీకరణాలను అధిగమిస్తే కేశినేని హ్యాట్రిక్ సాధించడం ఖాయమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+