నాకు అమ్మాయిల పిచ్చి, రోజుకో అమ్మాయి కావాలి.. కిరణ్ రాయల్ సంచలన ఆడియో లీక్

తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.కిరణ్‌ రాయల్‌ నిజస్వరూపాన్ని లక్ష్మి అనే మహిళ బయటపెట్టారు.రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.బాధిత మహిళతో కిరణ్ రాయల్ సన్నిహితంగా ఉన్న వీడియో సైతం బయటకు వచ్చింది.

అప్పు తీర్చమని అడిగితే తన పిల్లల్ని చంపుతామని బెదిరిస్తున్నాడని లక్ష్మి ఆరోపించారు.అయితే జగన్‌ను విమర్శించడం వల్లే తనని ఈ కేసులో ఇరికించారని చెప్పి కిరణ్ రాయల్ తప్పించుకునే ప్రయత్నం చేశారు.ఇదిలా ఉంటే బాధితురాలు లక్ష్మితో కిరణ్ రాయల్ మాట్లాడిన ఆడియో కాల్ రికార్డ్‌ను వైసీపీ తమ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఆడియో క్లిప్‌లో కిరణ్ రాయల్ మాట్లాడుతూ..''నాకు అమ్మాయిలు వీక్ నెస్ ఉంది. నేను లైఫ్ లాంగ్ ఇలానే ఉంటా. నేను మారలేను. కానీ, నిన్ను మాత్రం బాగా చూసుకుంటా అని చెప్పడం వినిపించింది.

kiran royal audio recording goes viral

నా కూతూరు మీద ఒట్టు. నేను చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకున్నా. నీకు 10 ఏళ్ల వయసు ఉండొచ్చేమో.. అప్పుడు రోజుకో అమ్మాయితో తిరిగే వాడ్ని. నీకు తెలిసి నలుగురి గురించే తెలుసు. కానీ, నీకు తెలిసిన ఆరుగురితో నేను తిరిగాను. ఈ ఏడు నెలల్లోనే ఆరుగురితో తిరిగా. ఇప్పటికీ ఇద్దరు అమ్మాయిలతో వాళ్ల ఇంటికి వెళ్తాను. మొత్తంగా నాకు ఓ 400 మందితో సంబంధం ఉండొచ్చని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు.కూటమి ప్రభుత్వం రాగానే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అని కిరణ్‌ రాయల్‌ బాధితురాలు లక్ష్మికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు.నన్ను ఎవరు ఏం చేస్తారు.. నేను పవన్ కల్యాణ్‌నే బ్లాక్ మెయిల్ చేస్తా నువ్వు ఎంత నాకు అంటూ కిరణ్ రాయల్ నన్ను బెదిరించాడని లక్ష్మి చెప్పుకొచ్చారు. మరోవైపు కిరణ్ రాయల్‌పై చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. కేవలం కిరణ్ రాయల్‌ను పార్టీ కార్యక్రమాలకు మాత్రమే దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసి పార్టీ అధినాయకత్వం చేతులు దులుపుకుంది.కిరణ్ రాయల్ ఇంతమంది మహిళల జీవితాలతో ఆడుకున్నారని తెలిసినా అతనిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆడపిల్లల రక్షణ గురించి ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తమ సొంత పార్టీ నాయకుడు అఘాయిత్యాలపై ఎందుకు నోరు మెదపడం లేదని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. మరి కిరణ్ రాయల్ అకృత్యాలపై కూటమి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+