ముద్దులతో రోగాలు మాయమట: కిస్సింగ్ బాబా అరెస్టు
కడప: కడప జిల్లాలో పోలీసులు నకిలీ సన్యాసిని అరెస్టు చేశారు. కిస్సింగ్ బాబాగా పేరు మోసిన అతన్ని పోలీసులు గురువారంనాడు అదుపులోకి తీసుకున్నారు. అన్ని పాపాలను ముద్దులతో మాయం చేస్తానని, ఆర్థిక, గృహ సంబంధమైన సమస్యలను పరిష్కారమవుతాయని చెబుతూ ప్రజలను ఆ బాబా మోసం చేస్తూ వస్తున్నాడు.

గత రెండు నెలలుగా ముద్దులూ ఆలింగనాలతో రోగాలను నయం చేస్తానని ఆ బాబా ప్రజలను నమ్మబలుకుతూ వస్తున్నాడు. కడప జిల్లాలోని ప్రొద్దుటూరులోని అయ్యప్ప స్వామి ఆలయం వెనక గల ఓ గదిని తన ఆశ్రయంగా మార్చుకున్నాడు. గురువారం ఉదయం పోలీసులు సోదాలు నిర్వహించినప్పుడు ఆ బాబా విషయం వెలుగులోకి వచ్చింది.
బాబాను అరెస్టు చేసి పోలీసులు కమలాపురం కోర్టులో ప్రవేశపెట్టారు. అతనికి కోర్టు జనవరి 7వ తేదీ వరకు కస్టడీ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు అతన్ని కడప పట్టణంలోని మెంటల్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. పోలీసులు బాబా అనుచరుడు సుబ్బారెడ్డిని కూడా అరెస్టు చేశారు. బాబా అద్భుతాల గురించి సుబ్బారెడ్డి ప్రచారం సాగిస్తూ వస్తున్నాడు.












Click it and Unblock the Notifications