రైల్వే ప్రయాణికులు ముందుగా ఈ విషయం తెలుసుకోవాలి!
ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులను తన గమ్యస్థానాలకు చేరుస్తోంది భారతీయ రైల్వే. రైలుబండి ప్రతి కంపార్ట్‌మెంట్‌పై 5 అంకెల నెంబరు రాసివుంటుంది. వాటివెనక ప్రత్యేక అర్థం ఉంది. ఈ నెంబర్ల అర్థం మీరు తెలుసుకుంటే మీ రైలు కంపార్ట్ మెంట్ గురించి ఎక్కువ సమాచారాన్ని తెలుసుకున్నట్లవుతుంది.
రైలులోని ప్రతి బోగీకి బయట రాసివుండే ఈ ఐదు నెంబర్లలో (ట్రైన్ కోచ్ నంబర్) బోగీని ఎప్పుడు నిర్మించారు? ఏ రకమైన బోగీ అనేది తెలుస్తుంది. మొదటి రెండు అంకెలు ఈ రైలు బోగీ ఎప్పుడు నిర్మించారో తెలియజేస్తాయి. చివరి మూడు అంకెలు దాని వర్గాన్ని తెలియజేస్తాయి. ఉదాహరణకు రైలు బోగీపై 05479 నంబర్ రాసి ఉందనుకుందాం. దీన్ని రెండుగా విడదీయాలి. మొదటి రెండు అంకెలు తయారుచేసిన సంవత్సరం...అంటే 2005లో తయారు చేశారని అర్థం.అదే బోగీపై 99397 అని రాసి ఉంటే 1998లో తయారైందనే అర్థం వస్తుంది.

బోగీపై రాసిన చివరి మూడు అంకెలు ఆ బోగీ వర్గాన్ని తెలియజేస్తాయి. మొదటి నెంబరు 05479లో బోగీ జనరల్ కేటగిరి అని, 99397 అనిరాసివున్న బోగీ స్లీపర్ క్లాస్ కు చెందినదని తెలియజేస్తుంది.
001-025:ఏసీ ఫస్ట్ క్లాస్
026-050 : కాంపోజిట్ 1AC + AC-2T
051-100: AC-2T
101-150 : AC-3T
151-200 : CC (AC చైర్ కార్)
201-400 : SL (2వ తరగతి Sleeper)
401-600 : GS (జనరల్ 2వ తరగతి)
601-700 : 2S (2వ తరగతి సిట్టింగ్/జన శతాబ్ది చైర్ క్లాస్)
701-800 : సిట్టింగ్ కమ్ లగేజ్ రేక్
801 + : ప్యాంట్రీ కార్, జనరేటర్ లేదంటే మెయిల్ అని అర్థం












Click it and Unblock the Notifications