Kodali Nani: మహిళలతో పాలతో కాళ్ళు కడిగించుకున్న వీడియో వైరల్.. టీడీపీ ఫైర్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాలలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్ని రాజకీయ పార్టీల నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ప్రజలతో అనేక కార్యక్రమాలలో మమేకం అవుతున్నారు. ఈ క్రమంలో అనేకచోట్ల ఆసక్తికర సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.
కృష్ణా జిల్లా గుడివాడలో ఆసక్తికర పరిణామం
ఎన్నికల్లో సహజంగా ఎవరైనా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళ కాళ్లు మొక్కుతారు. వాళ్ల ఇళ్లకు వెళ్లి వాళ్ళ పిల్లలను ఎత్తుకొని, రోడ్లపై ఇస్త్రీ బండ్ల మీద బట్టలు ఇస్త్రీ చేసి, హోటల్లో టీ తయారుచేసి జనాలకు ఇచ్చి.. ఇలా చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ఉంటారు. అయితే కృష్ణాజిల్లా గుడివాడలో మాత్రం అందుకు భిన్నంగా ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతున్నాయి.

పాలతో కాళ్ళు కడిగించుకున్న కొడాలి నాని
కృష్ణాజిల్లా గుడివాడలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలతో కలిసి ప్రార్థనలు జరిపిన మాజీ మంత్రి కొడాలి నాని అక్కడ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆ సమయంలో ఆయన మహిళలతో బిందెల కొద్దీ పాలతో కాళ్లు కడిగించుకున్న ఘటన చోటుచేసుకుంది. అయితే కొడాలి నాని కాళ్లు కడిగిన మహిళలలో ఒక మహిళ వాలంటీర్ కూడా ఉందని ఆమె ముఖానికి ముసుగు వేసుకొని కొడాలి నాని కాళ్లు కడిగారని తెలుగు తమ్ముళ్ళు ఆరోపిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో... కొడాలి నాని కాళ్లు కడిగిన...#Kodalinani #Gudivada #ysrcp #AndhraPradeshElections2024 #viralvideo #andhraprabhanews pic.twitter.com/0k8UX5EjmM
— Andhra Prabha News (@prabha_andhra) April 3, 2024
కొడాలి నానిపై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్ళు
అయితే ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కొడాలి నాని బలుపుకు, అహంకారానికి నిదర్శనమని మండిపడుతున్నారు. గుడివాడ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము ఈ ఘటన పైన తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు నిత్యం బూతులతో విరుచుకుపడే కొడాలి నాని మహిళలను చాలా చులకనగా చూస్తారన్నారు.
కొడాలి నానికి తగిన శాస్తి చేయాలన్న టీడీపీ
ఇందులో భాగంగానే మహిళలతో కొడాలి నాని తన కాళ్లు కడిగించుకున్నాడని మండిపడ్డారు. కొడాలి నానికి వచ్చే ఎన్నికలలో మహిళలు బుద్ధి చెప్పాలని, ఓట్ల రూపంలో కొడాలి నానికి తగిన శాస్తి చేయాలని వెనిగండ్ల రాము కోరారు. ప్రస్తుతం కొడాలి నాని పాలతో కాళ్ళు కడిగించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications