ఫ్లెక్సీ పక్కన ఫ్లెక్సీ పెడితే యుద్ధమా- కామెడీ పోస్టు- పవన్ కళ్యాణ్ పై కొడాలి ఫైర్..
వైసీపీకి పోటీగా ఈ మధ్య తరచుగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్న యుద్ధం వ్యాఖ్యలపై ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత కొడాలి నాని స్పందించారు. ఎవరెక్కడ యుద్ధం చేస్తారంటూ పవన్ తో పాటు చంద్రబాబు, బీజేపీని ఉద్దేశించి కొడాలి ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే అందరూ కలిసే యుద్దం చేస్తారా లేక ఎవరు ఎవరితో చేస్తారంటూ ఎద్దేవా చేశారు. ఎవరు ఎక్కడ యుద్ధానికి రెడీయో కనీసం వాళ్లకైనా క్లారిటీ ఉందా అని నిలదీశారు.
పవన్ ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు, ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నాడంటూ కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు, ఎన్ని చోట్ల చేయబోతున్నాడని అడిగారు. బిజెపి వీళ్లతో కలిసే యుద్ధం చేయబోతుందా, విడిగా చేస్తుందా అని అడిగారు. టీడీపీ,జనసేనలో టిక్కెట్లు ఆశించేవారికైనా వీటిపై క్లారిటీ ఉందా అని ప్రశ్నించారు.ఎక్కడ, ఎన్ని సీట్లలో పోటీచేస్తారో ముందు క్లారిటీ తెచ్చుకోవాలని విపక్షాలకు కొడాలి సూచించారు. ఆ తర్వాత యుద్ధం..సై...అనాలని సలహా ఇచ్చారు.

జగన్ మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో దూసుకెళ్తున్నాడని, మీరేమో యుద్ధం పేరుతో మా ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడుతున్నారని కొడాలి నాని ఆక్షేపించారు.ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడితే అది యుద్ధం అవ్వదని, కామెడీ పోస్ట్ అవుతుందన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే పలు చోట్ల వైసీపీ జగన్ ఫొటోతో పెడుతున్న సిద్ధం ఫ్లెక్సీలకు పోటీగా జనసేన యుద్ధం పేరుతో కౌంటర్ ఫ్లెక్సీలు పెడుతోంది. తద్వారా వైసీపీ సిద్ధం నినాదానికి కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కొడాలి నాని పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications