చిరంజీవికి కొడాలి నాని ఘాటు కౌంటర్- టాలీవుడ్లో పకోడీ గాళ్లు-తమ్ముడికి సలహా ఇవ్వొచ్చుగా ?

ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై మెగాస్టార్ చిరంజీవి ఇవాళ వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల వేడుకలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇంకా చెప్పాలంటే చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అధికార వైసీపీని బలంగా తాకాయి. దీంతో వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. చిరంజీవి వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. సినీ ఇండస్ట్రీలో చాలా మంది పకోడీ గాళ్లున్నారని, ప్రభుత్వం ఎలా ఉండాలో వారు సలహా ఇస్తున్నారంటూ కొడాలి ఫైర్ అయ్యారు.

అలాగే పకోడీ గాళ్లు సలహాలు తనవాళ్లకు ఇచ్చుకోవచ్చు కదా అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కొడాలి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీళ్లు తమ వారికి రాజకీయాలు ఎందుకు, డాన్స్, ఫైట్స్ యాక్షన్ మనం చూసుకుందాం అని చెప్పొచ్చు కదా అంటూ చిరంజీవిని, సోదరుడు పవన్ ను ఉద్దేశించి కొడాలి వ్యాఖ్యానించారు. దీంతో కొడాలి కౌంటర్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కొడాలి వ్యాఖ్యల్ని వైసీపీ నేతలు సమర్ధిస్తుండగా.. పవన్ అభిమానులు తప్పుబడుతున్నారు.

kodali nani strong counter to chiranjeevi remarks against ysrcp government

అంతకు ముందు ఏపీ ప్రభుత్వం పనితీరుపై ఎన్నడూ లేని విధంగా మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ పరిశ్రమపై పడ్డారంటూ వైసీపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి చిరంజీవి సూచించారు. దీంతో చిరంజీవి వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. గతంలో వైసీపీ సర్కార్ పనితీరును పలుమార్లు మెచ్చుకున్న చిరు.. ఈసారి ఎందుకిలా మాట్లాడారన్న ప్రశ్నలూ వినిపించాయి.

అలాగే ప్రజలకు సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధిపై దృష్టిపెట్టాలంటూ జగన్ సర్కార్ కు చిరంజీవి సూచించారు. ఉద్యోగ, ఉపాధిపై దృష్టి పెట్టినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారంటూ సలహా ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలందిస్తే అంతా తలవంచి నమస్కరిస్తారని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. దీంతో చిరంజీవి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. వీటిపైనే కొడాలి ఘాటుగా స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+