అమెరికాకు కొడాలి నాని - వైద్యుల బిగ్ అప్డేట్..!!
వైసీపీ ముఖ్య నేత కొడాలి నాని అమెరికా వెళ్లనున్నారు. కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో నాని ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్య కాలంలోనే ముంబాయిలో గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆ తరువాత నాని పూర్తిగా విశ్రాంతిలో ఉన్నారు. ముఖ్యమైన వారు మినహా ఎవరినీ కలవటం లేదు. మాజీ సీఎం జగన్ ఫోన్ ద్వారా పరామర్శించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న నాని మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, నాని ఆరోగ్యం నిలకడగా ఉందని పార్టీ నేతలు వెల్లడించారు.
మాజీ మంత్రి కొడాలి నాని అమెరికా వెళ్లనున్నారు. తొలుత హైదరాబాద్ లో నానికి వైద్య పరీక్ష లు చేసిన సమయంలో గుండెలో మూడు రక్త నాళాలు పూడుకుపోయినట్లు గుర్తించారు. బైపాస్ అవస రమని నిర్ధారించటంతో ప్రత్యేక విమానంలో ముంబాయికు తరలించారు. అక్కడ ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలోదాదాపు 8 గంటల పాటు బైపాస్ సర్జరీ నిర్వ హించారు. సర్జరీ తరువాత పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచా రు. ఆ తరువాత నాని కోలుకోవటంతో హైదరాబాద్ వచ్చేసారు. అక్కడే విశ్రాంతి తీసుకుంటు న్నారు. రాజకీయ వ్యవహారాలకు పూర్తి దూరంగా ఉన్నారు. మాజీ సీఎం జగన్ ఫోన్ లో నాని ని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో నాని ఆరోగ్యం పైన ఆరా తీసారు. నాని కోలుకున్నట్లుగా పార్టీ నేతలు వెల్లడించారు.

హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్న కొడాలి నాని పార్టీ ముఖ్య నేతలు మాత్రమే కలిసేందుకు అనుమతి ఇచ్చారు. సర్జరీ తరువాత వైద్యుల సూచన మేరకు ఎవరినీ కలవటం లేదు. కాగా, నాని ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేసారు. అయితే, మెరుగైన చికిత్స కోసం నాని అమెరికా వెళ్లనున్నారు. గతంలోనే ఈ మేరకు ఆలోచన చేసినా.. సర్జరీ తరువాత కొంత కాలం ఆగి వెళ్లాలనే వైద్యుల సూచన మేరకు ఇప్పుడు ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. నాని కోలుకున్నా.. కొంత కాలంగా పూర్తిగా రాజ కీయాలకు దూరంగా ఉండాల్సిందేనని చెబుతున్నారు. కాగా, నాని తిరిగి ఆరోగ్యంగా రావాలని ఆయన అభిమానులు.. పార్టీ కేడర్ పూజలు చేసింది. ప్రస్తుతం నాని కోలుకున్నారు. మరింత మెరుగైన చికిత్సతో పాటుగా విశ్రాంతి కోసం అమెరికా వెళ్తున్నట్లు తెలుస్తోంది.
-
Chandrababu: కాఫీ విత్ చంద్రబాబు-కార్యకర్తల కోసం కొత్త కబుర్లు ఇవే..! -
ప్రతి నెలా రూ. 3,000 సాయం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు -
West Bengal: బీజేపీతో బంధం బట్టబయలు-ముస్లిం పార్టీతో ఎంఐఎం కటాఫ్..! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్












Click it and Unblock the Notifications