భక్తులకు అరుదైన అవకాశం: రూ.150 చెల్లించి.. తిరుచానూర్ ఆలయంలో

TTD: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 11 నుండి 13వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం మే 10వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు టీటీడీ అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయనున్నారు. భక్తులు ఒక్కొక్కరు 150 రూపాయలను చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.

ఉత్సవాల్లో భాగంగా మే 12వ తేదీ ఉదయం 9.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.

Koil Alwar Tirumanjanam in Sri Padmavati temple at Tiruchanoor on May 6

సాయంత్రం 7:30 నుండి 8:30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మ‌వారు విహరించి భ‌క్తుల‌ను కటాక్షించనున్నారు. వార్షిక వసంత్సోవాలను పురస్కరించుకుని మే 6వ తేదీన ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తెల్లవారు జామున సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలుపుతారు.

6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.

ఉదయం 9 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. కోయిల్ అళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని మే 6, వసంతోత్సవాల కారణంగా మే 10 నుండి 13వ తేదీ వ‌రకు పలు ఆర్జిత సేవలు రద్దయ్యాయి. క‌ల్యాణోత్స‌వం, సహ‌స్ర‌దీపాలంకార సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

అటు ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 64,536 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 30,612 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.37 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో 26 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+