పవన్ ప్రమాణాన్ని గ్యాలరీ నుంచి వీక్షించిన నాగబాబు-ఎమోషనల్ ట్వీట్..!
ఏపీలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం కూడా అయిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవాళ అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్షణం కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్న ఆయన కుటుంబ సభ్యులు ఈ దృశ్యాల్ని వీక్షించి ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా పవన్ సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీ నుంచి నేరుగా పవన్ ప్రమాణాన్ని వీక్షించారు. ఈ వీడియోను స్వయంగా ఆయనే ట్వీట్ చేశారు.
పవన్ ప్రమాణాన్ని గ్యాలరీ లో నుంచి వీక్షిస్తున్న దృశ్యాన్ని జత చేస్తూ నాగబాబు ట్వీట్ చేశారు. ఇందులో ఆయన "పదేళ్ల కల నెరవేరింది,ప్రజా ప్రస్థానం మొదలైంది: అంటూ మొదలుపెట్టి.. " డిప్యూటీ C.M హోదా లో శాసనసభ లో ప్రమాణస్వీకారం చేస్తున్నటువంటి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని చూసి నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది, తోడబుట్టిన వాడిగా & జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది" అని తెలిపారు.

పదేళ్ల కల నెరవేరింది,ప్రజా ప్రస్థానం మొదలైంది:
— Naga Babu Konidela (@NagaBabuOffl) June 21, 2024
డిప్యూటీ C.M హోదా లో శాసనసభ లో ప్రమాణస్వీకారం చేస్తున్నటువంటి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని చూసి నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది,
తోడబుట్టిన వాడిగా & జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది,… pic.twitter.com/Bg2UewPmSp
అలాగే "పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ కి వెళ్లాలి 'పవన్ కళ్యాణ్ అను నేను' అని ప్రమాణస్వీకారం చేయాలనేది పదేళ్ల నా కల.. అసెంబ్లీ కి రావడం గ్యాలరీలో కూర్చోవడం నాకిదే మొదటిసారి I feel very thrill.. మా కుటుంబం అంతా కూటమిలో కళ్యాణ్ బాబు ఘన విజయం సాధించినందుకు చాల చాల సంతోషంగా & గర్వాంగా ఉన్నారు.. ఇంతటి అఖండ గెలుపునిచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమ్మకాన్ని అనుక్షణం నిలబెట్టుకుంటూ తనకి కేటాయించిన అన్ని మంత్రిత్వ శాఖలకి నిజాయితీతో,నిష్పక్షపాతంగా అన్ని విధాల అంతఃకరణ శుద్ధి తో న్యాయం చేస్తాడని నిర్భయంగా తెలియజేస్తున్నాను..." అని నాగబాబు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications