సోమిరెడ్డి తమ్ముడు నా మొదటి భర్త: వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి భావోద్వేగం
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఈనెల మొదట్లో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. నెల్లూరు ఎంపీగా ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యేగా ప్రశాంతి రెడ్డి కి చంద్రబాబు టికెట్లు కేటాయించారు. ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీ నుంచి ప్రశాంతిరెడ్డిపై దారుణంగా ట్రోలింగ్స్ ప్రారంభమయ్యాయి. తనగురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని భావించిన ప్రశాంతిరెడ్డి కోవూరులో నిర్వహించిన ఓ బహిరంగసభలో తన గతం గురించి చెప్పారు.
మీ ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్నానని, తాను ఎవరో మీకు చెప్పాలనుకుంటున్నానని, తన తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా అని వెల్లడించారు. తన చదువంతా తిరుపతిలోనే సాగిందని, అక్కడినుంచి నెల్లూరు జిల్లాలోని నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి చెల్లెలు ఏ ఇంటికోడలిగా వెళ్లారో.. తాను కూడా అదే ఇంటికి కోడలిగా వెళ్లానన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్థన్ రెడ్డి పెళ్లాడానని, తర్వాత ఆయన మరణించారన్నారు. తన కుటుంబ సభ్యులు, అత్తగారింట్లోని కుటుంబ సభ్యులు, పిల్లల అనుమతి తీసుకొని ఎంతోమందికి ఉపాధి కల్పించే ప్రభాకర్ రెడ్డిని రెండో వివాహం చేసుకున్నట్లు తెలిపారు.

మీ ఆడపడుచుగా ముందుకు వస్తున్నాను కాబట్టి తానెవరో మీకు పరిచయం చేసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కోవూరు అభ్యర్థిగా తనను ఆశీర్వదించాలంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రజలకు మరింత సేవ చేయడంకోసమే తాను, తన భర్త రాజకీయాల్లోకి వచ్చామన్నారు. ఎటువంటి సమస్య ఉన్నా తమ ఇంటికి రావొచ్చని, సమస్యలు తీరాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి చెల్లెలి ప్రస్తావనను నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీసుకువస్తూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గానే ప్రశాంతి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం










Click it and Unblock the Notifications