చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై కుప్పంలో లక్ష్మీ పార్వతి ఘాటువ్యాఖ్యలు
చంద్రబాబుకు సొంత బలం లేకపోవడంతోనే పవన్ కళ్యాణ్ ను వెంటేసుకు తిరుగుతున్నారని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ తరఫున తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబుకు విలువలు, విశ్వసనీయత లేవని మండిపడ్డారు.
చంద్రబాబు రాజకీయాలకు అనర్హుడు
2014-2019 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు రెండు లక్షల కోట్ల రూపాయలను సంపాదించారని ఆరోపించారు. ఇప్పటివరకు చంద్రబాబు మొత్తంగా అవినీతికి పాల్పడి ఆరు లక్షల కోట్ల రూపాయలను సంపాదించారని లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబుపై 25 కేసులు ఉన్నాయని, 25 కేసులున్న చంద్రబాబు రాజకీయాలకు అనర్హుడని అన్నారు. ఇతర పార్టీల్లోనూ చంద్రబాబు కోవర్టులు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు.

చంద్రబాబును ఓడిస్తే భరత్ కు మంత్రి పదవి
ఆయన విలువలతో కూడిన రాజకీయం ఏనాడూ చేయలేదన్నారు. టీడీపీని స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. ఆ పార్టీ ఆయనకు ఎలా సొంతమైందని ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పటివరకు కుప్పం నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తే భరత్ కు మంత్రి పదవి ఇస్తానని జగన్ ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేసిన లక్ష్మీపార్వతి, భరత్ గెలుస్తాడు అన్న విశ్వాసం తనకు ఉందన్నారు.
పవన్ కళ్యాణ్ సినిమా హీరో.. వైఎస్ జగన్ రియల్ హీరో
ఈసారి బాబు పప్పులు ఉడకవని, ప్రజలు మంచి కసి మీద ఉన్నారని, కుప్పంలో కప్పని ఆడించినట్టు బాబును ఆడిస్తారు అంటూ లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో మేక వన్నె పులిలా ఉన్న బాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవడంతో అసలు నిజస్వరూపం బయటపడిందని లక్ష్మీపార్వతి అన్నారు. అంతేకాదు సినిమా హీరో పవన్ కళ్యాణ్.. రియల్ హీరో వైయస్ జగన్ అని పేర్కొన్నారు.
కాపీ మేనిఫెస్టో ప్రకటించారు
కుప్పంలో చంద్రబాబును ఓడించాలి అంటూ పిలుపునిచ్చారు. చంద్రబాబు వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎన్టీఆర్ కుటుంబమేనని, మమ్మల్ని మోసం చేసింది కాకుండా 35 సంవత్సరాలుగా చంద్రబాబు కుప్పం ప్రజలను మోసం చేస్తున్నారని, దొంగ ఓట్లతో గెలుస్తున్నారు అని ఆరోపించారు. అన్ని రాష్ట్రాల పథకాలను కలిపి కాపీ మేనిఫెస్టోను ప్రకటించారని, ఇక కూటమి ఉమ్మడి మేనిఫెస్టో పైన బిజెపి నేతలకే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు.
-
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications