విద్యార్థులుగా హాస్టల్లో: ల్యాప్‌టాప్ చోరులు (పిక్చర్స్)
హైదరాబాద్: విద్యార్థులుగా అవతారమెత్తి ల్యాప్‌టాప్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చతేశారు. హాస్టల్స్‌లో ఉంటూ విద్యార్థులతో స్నేహం చేసుకుని, వారితో కలిసి ఉంటామని చెప్పి, వారిని నమ్మించి ల్యాప్‌టాప్ దొంగతనాలకు పాల్పడుతూ వస్తున్న వారిని పోలీసులు సోమవారం అరెస్టు చేసారు
అరెస్టు చేసిన ఇద్దరి నుంచి పోలీసులు 20 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెదిన అమానుల్లా ఖాన్ (21) కంప్యూటర్ కోర్సు చేయడానికి హైదరాబాద్ వచ్చాడు. నాంపల్లిలో నివసించే మహ్మద్ తౌఫిక్ (18) హార్డ్‌వేర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. వారిద్దరు స్నేహితులుగా మారి ల్యాప్‌టాప్‌లు దొంగిలించడం ప్రారంభించారు.
మెహిదీపట్నం ప్రాంతంలోని హాస్టళ్లలో ఉంటూ వారు చోరీలకు పాల్పడేవారు. ఆసిఫ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఐదు, ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ కేసు వారిపై నమోదయ్యాయి. ఈ మేరకు ఆసిఫ్ నగర్ అదనపు ఇన్‌స్పెక్టర్ రఘునాథ్ బృందం అమానుల్లాఖాన్, తౌఫిక్‌లను ల్యాప్‌టాప్‌లను అమ్మడానికి మెహిదీపట్నం వచ్చినప్పుడు దాడి చేసి పట్టుకున్నారు.

హాస్టల్లో ఉంటూ..
హాస్టళ్లలో ఉంటూ, విద్యార్థులుగా నమ్మించి ఇతర విద్యార్థుల నుంచి ల్యాప్‌టాప్‌లను దొంగిలిస్తూ వచ్చిన ఇద్దరిని పోలీసులు సోమవారంనాడు అరెస్టు చేశారు.

ఒకతనిది ఔరంగాబాద్..
కంప్యూటర్ కోర్సు చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చిన అమానుల్లా ఖాన్ అనే 21 ఏళ్ల యువకుడు ఇద్దరు చోరుల్లో ఒకతను

హార్డ్‌వేర్ మెకానిక్ మరొకతను...
హైదరాబాదులోని నాంపల్లి ప్రాంతంలో హార్డ్‌వేర్ మెకానిక్‌గా పనిచేస్తున్న తౌఫిక్ అనే యువకుడు అమానుల్లా ఖాన్‌తో కలిసి ల్యాప్‌టాప్ చోరీలకు పాల్పడుతూ వచ్చాడు.

అమ్ముతుండగా పట్టుకున్నారు...
తాము దొంగిలించిన ల్యాప్‌టాప్‌లను అమ్మడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు ఇద్దరు యువకులను పట్టుకున్నారు. వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications