ఏపీలోని ప‌లుప్రాంతాల్లో తేలిక‌పాటి వ‌ర్షాలు...తెలంగాణ‌లో పొడి వాతావ‌ర‌ణం..

ఏపీలోని ప‌లుప్రాంతాల్లో తేలిక‌పాటి వ‌ర్షాలు...తెలంగాణ‌లో పొడి వాతావ‌ర‌ణం : మార్చి నెల ముందు నుంచే రాష్ట్రంలో ఎండ‌ల తీవ్రంగా అధికంగా ఉంది. అయితే, ఏపీ ప్ర‌జ‌లకు వాతావ‌ర‌ణ‌శాఖ శుభ‌వార్త‌ను అందించింది. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో తేలిక‌పాటి వ‌ర్షాలు ప‌డే సూచ‌న‌లున్న‌ట్లు వాతావ‌వ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న దక్షిణ అంతర్గత కర్ణాటక, పొరుగు ప్రాంతాల మీద సగటు సముద్రమట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వివ‌రించారు. అంతేకాదు, ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, పొరుగు ప్రాంతాల మీద సగటు సముద్రమట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాత‌వార‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు.

ఈ ప్రభావంతో ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు ఉంటాయ‌ని తెలిపారు. ఇక‌, ఉత్తర కోస్తాంధ్రలో ఒక‌టి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని అమ‌రావ‌తి వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతం మాత్రం వాతావరణం పొడిగానే ఉంటుందని అధికారులు వెల్లడించారు. మ‌రికొన్ని ప్రాంతాల్లో అయితే, పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని వారు వివ‌రించారు.

Light rains in many parts of AP Dry weather in Telangana

దక్షిణ కోస్తాలోని ప‌లుప్రాంతాల్లో కూడా పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ద్రోణి ఒకటి ఉత్తర ఛత్తీస్‌గఢ్ విదర్భ, తెలంగాణ మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీట‌ర్ల‌ ఎత్తులో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖా కేంద్రం అధికారులు వెల్ల‌డించారు. ఈ రోజు కింది స్థాయిలోని గాలులు దక్షిణ, నైరుతి దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుగా వీచే అవ‌కాశాలున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంద‌ని, అందుకే ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు వివ‌రించారు.

హైద‌ర‌బాద్‌లో పొగమంచు పరిస్థితులు : ఇక‌, హైద‌ర‌బాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉన్న‌ట్లు వారు వివ‌రించారు. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో నైరుతి దిశగా వీచే అవ‌కాశం ఉన్న‌ట్లు హైదరాబాద్ వాతావరణ శాఖా కేంద్రం అధికారులు ప్ర‌క‌టించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+