లిక్కర్ షాపు లైసెన్స్ ల కోసం పోటాపోటీ, ఎందుకో తెలుసా !!
ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం విధానం ఖరారు అయ్యింది. ఈనెల 12వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానం అమలులోకి రానుంది. ఈరోజే నుండి నూతన మద్యం విధానానికి ఎక్సైజ్ శాఖ తెరలేపింది. ఆంధ్రప్రదేశ్ లో 3,396 కొత్త మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దరఖాస్తుల ఆహ్వానించింది.
గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడపడంతో అంతకాలం మద్యం వ్యాపారం చేస్తున్న వ్యాపారాలు గత ఐదు సంవత్సరాలు సైలెంట్ అయిపోయారు. ఇంతకాలం తర్వాత లిక్కర్ షాపులు ఏర్పాటు చేయడానికి అవకాశం రావడంతో మద్యం వ్యాపారులు పోటీ పడుతున్నారు.చాలాకాలం తర్వాత ప్రైవేట్ వ్యక్తుల చేతికి మద్యం దుకాణాల లైసెన్సులు వస్తుండడంతో లిక్కర్ షాపుల లైసెన్స్ కోసం పోటీ చాలా ఎక్కువగా ఉంది.

ఎక్కువగా అధికార పార్టీ నాయకులు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి తోడు ఒకే వ్యక్తి ఎన్ని లైసెన్స్ లకు అయినా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఎక్సైజ్ శాఖ అధికారి స్పష్టం చేయడంతో పలుకుబడి కలిగిన అధికార పార్టీ నాయకుల ఆశీస్సులతో పలువురు మద్యం వ్యాపారులు లిక్కర్ షాప్ లైసెన్సులు దక్కించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం లో దిక్కుమాలిన చీప్ లిక్కర్ తాగి ఆరోగ్యం పాడుచేస్తున్న మందుబాబులు ఇప్పుడు బ్రాండెడ్ మద్యం సేవించడానికి తాహతహలాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మద్యం వ్యాపారం జోరుగా ఉంటుందని పసిగట్టిన వ్యాపారులు లిక్కర్ షాప్ ల లైసెన్సులు దక్కించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని జిల్లాలలో లిక్కర్ వ్యాపారులు రాజీ అయ్యి సిండికేట్ గా మొత్తం షాపు లైసెన్సులు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారని వైసీపీ నాయకులు అప్పుడే ఆరోపణలు చేస్తున్నారు

మరోవైపు లైసెన్సులు దక్కించుకున్న వ్యాపారాలు అందరూ కలిసికట్టుగా ఒక సిండికేట్ ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటినుండి చర్చలు మొదలు పెట్టారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే. లిక్కర్ షాప్ లైసెన్స్ లు దక్కవని అక్కసుతో ఇప్పటి నుండే మాపైన బురద చల్లడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని అధికార పార్టీ నాయకులు మండిపడుతున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానం అమలులోకి వస్తుండటంతో లిక్కర్ షాప్ లైసెన్స్ లకు భలే డిమాండ్ ఏర్పడింది. దానికి తోడు లిక్కర్ షాప్ లైసెన్స్ ఫీజులు నాలుగు విడతల్లో చెల్లించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించడం కూడా ఇప్పుడు ఈ పోటీ ఎక్కువ అయ్యింది.












Click it and Unblock the Notifications