"మందుబాబు" లకు సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ కష్టమేనా..?
తెలుగు వారి అతిపెద్ద పండుగ "సంక్రాంతి" శోభ మొదలైంది. ఏపీ, తెలంగాణల్లో ఈ పండుగను మూడు నుంచి నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. రైతులు పండించిన పంట ఇంటికి వచ్చే సమయం కాబట్టి దీనిని "రైతు పండుగ"గా కూడా పిలుస్తారు. అందుకే ఎక్కడెక్కడ ఉన్నవారు కూడా.. సంక్రాంతి సమయానికి సొంతూళ్లకు చేరుకుంటారు. సంక్రాంతి పండుగ అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది.. కొత్త బట్టలు, పిండివంటలు, గాలిపటాలు, ముగ్గులు, ఘాటైన ఘుమఘుమలతో వంటకాలు, కోడి పందాలు. వీటితో పాటు మందు బాబుల హడావిడి కూడా షరా మామూలే. కానీ ఈ పండుగ సమయంలో ఏపీలో మద్యం ప్రియులకు బిగ్ షాక్ తగిలింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ ధరలు పెరిగాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రూ.99 ఎంఆర్‌పీ ఉన్న మద్యం బాటిళ్లను మినహాయించి మిగిలిన అన్ని రకాల మద్యం ఉత్పత్తులపై ఒక్కో బాటిల్‌కు రూ.10 చొప్పున ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో IMFL, FL, బీర్, వైన్ వంటి అన్ని విభాగాల మద్యం ఉత్పత్తులు ఉన్నాయి. రూ.99 ధర ఉన్న బీర్, వైన్ బాటిళ్లకు మాత్రం ఈ పెంపు వర్తించదని సర్కారు స్పష్టం చేసింది.

అంతే కాకుండా ఇదే సమయంలో మద్యం విక్రయాల్లో రిటైలర్లకు ఇచ్చే మార్జిన్‌ను కూడా ప్రభుత్వం స్వల్పంగా పెంచింది. IMFL, FLతో పాటు రూ.99 ఎంఆర్‌పీ ఉన్న బీర్, వైన్ బాటిళ్లపై రిటైలర్ మార్జిన్‌ను 1 శాతం పెంచాలని నిర్ణయించింది. మద్యం ధరలు పెంచడం ద్వారా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.1,391 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో సంక్రాంతి సమయంలో.. మద్యం ధరలు పెంచడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక బార్లు మరియు మద్యం షాపుల్లో ఒకే రకమైన మద్యం ఉత్పత్తులకు వేర్వేరు ధరలు ఉండటంతో వినియోగదారుల్లో అయోమయం ఏర్పడుతోంది. ఈ అసమానతను తొలగించేందుకు ప్రభుత్వం అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ఉపసంహరించాలని నిర్ణయించింది. దీంతో బార్లు, షాపుల్లో ధరలు సమానంగా ఉండే అవకాశం ఉంది. ధరల పెంపుతో మద్యం ప్రియులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
-
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం











Click it and Unblock the Notifications