Tirupati: తిరుపతిలో ఆ ప్రాంతాల్లో బ్యాన్, కండీషన్స్

కలియుగ దైవం ఏడుకొండలస్వామి కొలువుతీరిన తిరుమల కిందనే ఉన్న తిరుపతిలో మద్యం వ్యాపారానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం తిరుపతిలో దాదాపు అన్ని మద్యం దుకాణాలు ఆ ప్రభుత్వమే నడిపింది. కొన్ని చోట్ల మాత్రమే బార్ అండ్ రెస్టారెంట్ లు ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లోకి వెళ్లాయి. ఇప్పుడు తిరుపతి నగరంలో మొత్తం దుకాణాలు ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లోకి వెళ్లాయి.

గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతిలో ఇష్టానుసారంగా లిక్కర్ వ్యాపారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. తిరుపతిలో ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు. స్థానికులతో పాటు పర్యాటకులు కూడా మద్యం తాగడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి తిరుపతిలో లిక్కర్ షాప్ లైసెన్స్ దక్కించుకుంటే కాసులు కురుస్తుందని మద్యం వ్యాపారులకు బాగా తెలుసు. ప్రతి రోజు లక్షల మంది పర్యాటకులు వచ్చేవెళ్లే తిరుపతిలో జనాభా కూడా ఎక్కువగా ఉండడంతో లిక్కర్ వ్యాపారం జోరుగానే జరుగుతుంది.

Liquor shops are not allowed on the route from Tirupati city to Tirumala

అలాంటి తిరుపతిలో మద్యం వ్యాపారం అంటే చిన్న విషయం కాదు. షాపుల లక్షలాది రూపాయలు లావాదేవీలు ఉంటాయి. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతిలో ఎక్కడంటే అక్కడ లిక్కర్ షాప్ లు పెట్టారని స్థానికులు ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో తిరుపతిలో ఎక్కడంటే అక్కడ లిక్కర్ షాపులు ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండా కొన్ని నిబంధనలు పెట్టారు.

తిరుపతిలో కొన్ని ప్రాంతాల్లో లిక్కర్ షాపులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిషేధం విధించింది. తిరుమల శ్రీవారి భక్తులు తిరుపతి మీదుగానే తిరుమలకు వెళ్లాల్సి ఉంది. తిరుపతి నగరంలోని తిరుమలకు వెళ్లే మార్గాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే మార్గాలలోని ఆర్ టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిలతీర్థం, అలిపిరి, స్విమ్స్ ,రుయా ఆస్పత్రి సర్కిల్ వరకు ఉన్న బైపాస్ రోడ్డులో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు.

అయితే ప్రధాన రహదారి కాకుండా ఆ రహదారి వెనకు ఉన్న భవనాలలో మద్యం దుకాణాలు ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుమలకు వెళ్లే ప్రధాన రహదారుల్లో మద్యం దుకాణాలు ఉండకూడదని, ఆ లిక్కర్ షాపుల చూసి భక్తులు మద్యం సేవించకూడదు అనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని సమాచారం. మొత్తం మీద తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ప్రధాన రహదారిలో ఎక్కడ కూడా లిక్కర్ షాప్ కనపడకుండా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+