లోకేష్ పుట్టినరోజు... ఒకరిని మించి ఒకరు భువనేశ్వరి, బ్రాహ్మణి ఆసక్తికర పోస్టులు!

ఏపీ మంత్రి, ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖుల నుండి, తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుండి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తమ తమ నియోజకవర్గాలలో బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు.

లోకేష్ పుట్టినరోజు
ఇక ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లోకేష్ పట్ల తమ ప్రేమని వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. ఇక లోకేష్ తల్లి భువనేశ్వరి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్ పెట్టారు.

Lokesh birthday Interesting posts from Bhuvaneswari and Brahmani

భువనేశ్వరి ట్వీట్
మన రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు పెట్టుబడుల కోసం దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటున్న నీకు నా ఆశీస్సులు ఉంటాయి అని ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా నీకు విజయం, అంతులేని ఆనందంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను అని ఆల్ ది బెస్ట్ నాన్న అంటూ భువనేశ్వరి ట్వీట్ చేశారు. ఇక లోకేష్ తో కలిసి దిగిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

బ్రాహ్మణి ఆసక్తికర ట్వీట్
లోకేష్ పుట్టినరోజు సందర్భంగా బ్రాహ్మణి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నాపై మీ ప్రేమ అంకితభావానికి కృతజ్ఞురాలిని అని పేర్కొన్న బ్రాహ్మణి మీరు చేసే ప్రతిపనికి నేను చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా ఈరోజు మీరు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ఈ సంవత్సరం కూడా మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే లవ్ ఆఫ్ మై లైఫ్ అని బ్రాహ్మణి పోస్ట్ చేశారు.

పుట్టినరోజున దావోస్ లో బిజీబిజీగా లోకేష్
ఇక లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మంత్రులు నేతలు పెద్ద ఎత్తున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మరోవైపు దావోస్ పర్యటనలో లోకేష్ దూసుకుపోతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా లోకేష్ వివిధ రంగాల ప్రముఖులతో భేటీ అయ్యి చర్చలు జరుపుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టవలసిందిగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులను లోకేష్ కోరుతున్నారు. పుట్టినరోజు రోజున కూడా లోకేష్ వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతూ బిజీ బిజీగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+