Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మద్దతు కోరిన లండన్ మేయర్ అభ్యర్ధి-కారణమిదే..!

ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు విదేశాల నుంచి కూడా మద్దతు ఇవ్వాలనే ఆఫర్ వచ్చింది. విదేశాల్లో, ముఖ్యంగా బ్రిటన్ లో అత్యధిక సంఖ్యలో అభిమానుల్ని, జనసేన పార్టీ ఎన్నారైలను కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ మద్దతు కోరుతూ లండన్ మేయర్ ఎన్నికల అభ్యర్ధి తరుణ్ గులాటీ ఇవాళ ఆయన్ను కలిశారు. జనసేన కార్యకర్తలు, ఫ్యాన్స్ తో తనకు మద్దతు ఇప్పించాలని కోరారు.

లండన్ మేయర్ ఎన్నికలలో పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి, పారిశ్రామికవేత్త తరుణ్ గులాటీ ఇవాళ హైదరాబాద్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న గులాటీ మేయర్ ఎన్నికల్లో తనకు మద్దతు పలకాల్సిందిగా పవన్ ను కోరారు. తాను పోటీ చేస్తున్న ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు గణనీయంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

london mayor election candidate tarun gulati seek pawan kalyan support-here is the reason

తరుణ్ గులాటీ అభ్యర్థనను పవన్ కళ్యాణ్ కూడా స్వాగతించారు. భారత సంతతికి చెందిన గులాటి లండన్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేయడం సంతోషదాయకమని, తన అభిమానులు, జనసేన శ్రేణులతోపాటు తెలుగువారు, భారతీయులంతా ఆయన విజయానికి కృషి చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. తనను కలసిన గులాటీకి శుభాభినందనలు తెలియచేశారు. దీంతో ఆయన కూడా పవన్ మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు.

london mayor election candidate tarun gulati seek pawan kalyan support-here is the reason

గతంలో పవన్ కళ్యాణ్ హార్డర్డ్ విశ్వవిద్యాలయంతో పాటు పలు విదేశీ వేదికలపై ప్రసంగాలు చేశారు. అలాగే వీలు దొరికినప్పుడల్లా విదేశాల్లో పర్యటిస్తూ తన అభిమానులు, జనసేన పార్టీ ఎన్నారై విభాగం సభ్యుల్ని కలుస్తూనే ఉంటారు. ఇదే క్రమంలో ఆయన అభిమానుల సూచన మేరకు లండన్ మేయర్ ఎన్నికల అభ్యర్ధి గులాటీ ఇవాళ ఆయన్ను కలిసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+