అల్లు అర్జున్ ఆస్తి ఎంతో తెలుసా?
అల్లు అర్జున్.. ఈరోజు దేశవ్యాప్తంగా పేరుగా కాకుండా బ్రాండ్ నేమ్ గా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనికి కారణం 'పుష్ప'. ఈ చిత్రం అంతర్జాతీయంగా పలు దేశాల్లోని ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. 2003లో 'గంగోత్రి' సినిమా చేసేటప్పుడు ఈ ఐకానిక్ స్టార్ అందుకున్న తొలి వేతనం రూ.3500. అక్కడి నుంచి ఆయన చిత్రాల పరంగానే కాదు.. ఆస్తుల పరంగా కూడా అనేక మెట్లను అధిరోహిస్తూ వచ్చారు. ఈ ప్రయాణంలో అతనికి తోడున్నవి అంకితభావం, కృషి.
దక్షిణ భారతదేశం మొత్తంమీద అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో ఒకడిగా అల్లు అర్జున్ పేరు తెచ్చుకున్నారు. ఇటీవలే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాల కాలాన్ని పూర్తిచేసుకున్నారు. ఈ 20 సంవత్సరాల కాలంలో కొన్ని వేల రూపాయల సంపాదన నుంచి సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం కోట్లను ఆర్జించే స్థాయికి చేరుకున్నాడు. స్టైలిష్ స్టార్ ఆస్తుల నికర విలువ రూ. 354 కోట్లు.

అల్లు అర్జున్ దగ్గర ఉన్న కార్లు
* రేంజ్ రోవర్
* హమ్మర్ H2
* జాగ్వార్ XJ L
* వోల్వో XC90 T8 ఎక్సలెన్స్
* మెర్సిడెస్ GLE 350d
* BMW X6m
* ఫాల్కన్ వానిటీ వాన్

అల్లు అర్జున్ స్థిరాస్తులు
* నార్సింగిలోని అల్లు స్టూడియోస్
* అల్లు ఎంటర్‌టైన్‌మెంట్ [ప్రొడక్షన్ హౌస్]
* ఆశీర్వాదం [ఫాంహౌస్]
* జూబ్లీహిల్స్‌లో ఒక విలాసవంతమైన భవనం












Click it and Unblock the Notifications