కేశినేని-కొలికపూడి వార్ లో బిగ్ టర్న్..! తిరువూరు వాట్సాప్ లలో రాసలీలలు..?
ఏపీలో అధికార టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య సాగుతున్న పోరు రోజుకో ములుపు తిరుగుతోంది. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య క్షేత్రస్ధాయిలో తీవ్ర మాటల యుద్ధం సాగుతుండగా.. మధ్యలో అధిష్టానం పలుమార్లు జోక్యం చేసుకుని శాంతింపజేసింది. అయినా క్షేత్రస్ధాయిలో పరిస్ధితుల్లో మార్పు రాకపోగా మరింత ముదురుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా తిరువూరులో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కొలికపూడి శ్రీనివాస్ ను టార్గెట్ చేస్తూ స్థానికంగా ఉన్న కేశినేని చిన్ని వర్గీయులు చేస్తున్న రచ్చతో మరోసారి ఆయన వారిపై పైర్ అవుతున్నారు. దీంతో వారు కూడా పోటాపోటీగా ఆయనతో సై అంటే సై అంటున్నారు. దీంతో కొలికపూడి రాసలీలలు అంటూ తాజాగా పలువురు తిరువూరు నేతలు తమ వాట్సాప్ స్టేటస్ లలో కొన్ని వీడియోలు, ఫొటోలు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో కొలికపూడి కూడా కేశినేని మద్దతుదారుల్ని టార్గెట్ చేస్తూ వారి రహస్య ఫొటోల్ని బయటపెట్టారు.

దీంతో ప్రస్తుతం తిరువూరు ఎమ్మెల్యే వర్సెస్ నాలుగు మండలాల ముఖ్య నాయకులు అన్నట్లుగా పరిస్ధితి మారిపోయింది.
తాజాగా ఎమ్మెల్యే కొలికపూడి వాట్సాప్ స్టేటస్ లో విస్సన్ పేట మండల నాయకుల్ని టార్గెట్ చేస్తూ కొన్ని ఫొటోలు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో స్ధానిక నాయకుడు సుబ్బారావు ఎమ్మెల్యే రాసలీలలు అంటూ టీడీపీ గ్రూపులో ఫొటోలు పెట్టినట్లు సమాచారం. దానికి కౌంటర్ గా సాక్షాత్తు ఎమ్మెల్యే.. టీడీపీ ముఖ్య నాయకుల రాసలీల ఫోటోలు వాట్సప్ స్టేటస్ లో పెట్టడం చర్చకు దారితీసింది. దీంతో ఈ వార్ కు ఎండ్ ఎప్పుడన్న చర్చ ఇప్పుడు నియోజకవర్గంలో జరుగుతోంది.

గతంలో ఓసారి కేశినేని చిన్ని, కొలికపూడి వర్గాల్ని పిలిపించి మాట్లాడిన టీడీపీ అధిష్టానం మరోసారి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని హెచ్చరికలు చేసింది. అయినా పరిస్ధితిలో మార్పు రావడం లేదు. అయితే ఈసారి మాత్రం కేశినేని చిన్ని ఎక్కడా బయటపడకుండా తన మద్దతుదారులతో కొలికపూడిపై వార్ చేయిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. దీనిపై కొలికపూడి బహిరంగ ఆరోపణలే చేస్తున్నారు. దీంతో ఈసారి టీడీపీ అధిష్టానం ఏం చేయబోతోందన్న ఉత్కంఠ మొదలైంది.












Click it and Unblock the Notifications