అర్ధనగ్న ఫొటోలు, అశ్లీల వీడియోలు: వ్యక్తి అరెస్టు

రాజమండ్రి: ఉన్నతాధికారులకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నాడని అనుమానిస్తున్న ఓ వ్యక్తిని తూర్పు గోదావరి జిల్లాలోని మలికిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ పేరుతో అతను అరాచకాలకు పాల్పడుతున్న స్థానిక పోలీసులు గుర్తించారు. అతన్ని తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం చింతపల్లి గ్రామానికి చెందిన ముప్పర్తి ప్రవీణ్‌గా గుర్తించారు.

ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్న విషయాన్ని మలికిపురం పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. శనివారం సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెడుతామని పోలీసులు చెబుతున్నారు. ప్రవీణ్‌ నుంచి పోలీసులు అమ్మాయిల అర్థనగ్న ఫొటోలను, అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. ఓ కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

 A man arrested suspecting trafficing

అతనికి కొంత మంది ఐపిఎస్‌ అధికారులతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. దాంతో అతన్ని విడిచిపెట్టాలని మలికిపురం పోలీసులపై ఒత్తిడి పెరుగుతున్నట్లు వార్త వస్తున్నాయి. సత్యరాజు అనే వ్యక్తితో జరిగిన గొడవలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తీగ లాగితే డొంకంతా కదిలింది. అతని కార్యకలాపాల గురించి పోలీసులకు వివరాలు తెలిశాయి.

ప్రవీణ్‌కు చెందిన ఓ డైరీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డైరీ ద్వారా మరిన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+