దర్శకుడని నమ్మి భర్తకు విడాకులు, రెండో పెళ్లి

 Man cheats woman posing as film director
హైదరాబాద్: సినీ దర్శకుడినని చెప్పిన ఓ వ్యక్తి చేతిలో మహిళ మోసపోయిన సంఘటన చోటు చేసుకుంది. తాను సినీదర్శకుడినని చెప్పి మహిళను వివాహం చేసుకుని ఆ తర్వాత ఆమె దగ్గర డబ్బులు దండుకుని మోసం చేశాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహిళ ఆదివారం హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసుల కథనం ఇలా ఉంది - కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మహిళ (29)కు గతంలో పెళ్లయింది. ఆమెకు భర్త,త ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం బంజారాహిల్స్‌లోని గౌరీశంకర్ కాలనీకి చెందిన బత్తుల దైవకృపరాజు (32) అనే వ్యక్తి ఆమెకు పరిచమయ్యాడు.

తాను సినీ దర్శకుడినని, ప్రేమిస్తున్నానని రాజు ఆమెను నమ్మించాడు. దీంతో ఆమె తన భర్తకు విడాకులచ్చి 2009 జనవరి 21వ తేదీన రాజును విజయవాడ దుర్గగుడిలో పెళ్లి చేసుకుంది. త్వరలోనే ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు నమ్మించి ఆమె నుంచి దాదాపు 5 లక్షల రూపాయలు తీసుకున్నాడు. కొంత కాలం తర్వాత ఇరువురి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి.

తాను మరో పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి జులైలో రాజు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సెల్‌ఫోన్‌కు కాల్ చేస్తే కూడా అందుబాటులోకి రాలేదు. ఎంతకూ అతను తిరిగి రాకపోవడంతో మోసం చేసి వెళ్లిపోయాడని గ్రహించి అతని గురించి ఆరా తీసింది.అతను దర్శకుడు కాదని, కారు డ్రైవర్ అని ఆమె తెలుసుకుంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+