స్వైన్ ఫ్లూ: అపోలోలో ఒకరు మృతి, రుయాలో నర్స్‌కు సోకింది
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం అపోలో ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన నర్సింహులు.
పుల్కల్‌లో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్‌గా నర్సింహులు పని చేస్తున్నారు. స్వైన్‌ఫ్లూ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

తిరుపతి రుయా ఆసుపత్రిలో నర్స్‌కు స్వైన్ ప్లూ
చిత్తూరు జిల్లాలో స్వైన్ ప్లూ వీరవిహారం చేస్తుంది. తిరుపతి రుయాలో నర్స్‌కు స్వైన్ ప్లూ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రిలోని స్వైన్ ప్లూ వార్డులో గతకొన్నాళ్లుగా నర్స్ సేవలు అందిస్తున్నారు.
తీవ్ర జలుబు, జ్వరంతో బాధపడుతున్న నర్స్‌కు వైద్య పరీక్షలు చేపట్టిన వైద్యులు స్వైన్ ప్లూ ఉన్నట్లు నిర్ధారించారు. ఇది ఇలా ఉంటే డాక్టర్ల నిర్లక్యం వల్లే చిత్తూరు జిల్లాలో వ్యాధి ప్రభలుతోందని ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో ఇద్దరికి స్వైన్ ప్లూ లక్షణాలు
ఏపీలో స్వైన్ ప్లూ బారినపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. ప్రకాశం జిల్లాలో ఇద్దరికి స్వైన్ ప్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరు ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
స్వైన్ ప్లూతో నెల్లూరు జిల్లా మహిళ మృతి
నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళ స్వైన్ ప్లూతో మరణించినట్లు సమాచారం. నెల్లూరులోని గొల్లగమూడికి చెందిన మహిళ చెన్నైలోని ఆసుపత్రిలో స్వైన్ ప్లూ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు తెలుస్తోంది.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications