ఏంటీ కులపిచ్చి: ప్రేమిస్తే కూతురును చంపేస్తాడా...నెల్లూరులో ఏం జరిగింది..?

ప్రేమించుకుంటున్న వారిపై తల్లిదండ్రుల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మొన్న నల్గొండలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య, హైదరాబాదు ఎర్రగడ్డలో మరో యువతిపై హత్యాయత్నం ఘటనలు మరువక ముందే ఏపీలోని నెల్లూరు జిల్లాలో మరో తండ్రి తన కూతురిపై కత్తితో దాడి చేసి హత్యచేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా గూడూరులో కలకలం సృష్టించింది. ప్రశాంతంగా ఉన్న గూడూరు నగరం ఈ దాడితో ఒక్కసారి ఉలిక్కి పడింది.

నెల్లూరు జిల్లా గూడూరులో దేవయాని అనే యువతి ఓ యువకుడిని ప్రేమిస్తోంది. గతకొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. దేవయాని తండ్రికి ఈ విషయం తెలిసింది. అబ్బాయిని ప్రేమించడం మానివేయాలని పలుమార్లు కోరాడు. తండ్రి మాట వినకపోవడంతో ఆయన ఆగ్రహానికి గురయ్యాడు. శుక్రవారం గూడూరులోని జీఎస్ రాయల్ సెంటర్‌లో కూతురు దేవయానిపై కత్తితో దాడి చేశాడు. తలపై కత్తితో దాడి చేయడంతో దేవయానికి తీవ్ర రక్తస్రావం అయ్యింది.

Man tries to kill his own daughter over intercast love

రక్తపు మడుగులో పడిఉన్న దేవయానిని స్థానికులు గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రక్తం ఎక్కువగా పోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. దేవయాని మరో కులానికి చెందిన వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడుపుతుండటంతోనే తండ్రి ఆమెపై హత్యాయత్నం చేశాడని బంధువులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+