మంచు మనోజ్-భూమా మౌనిక రెడ్డి హనీమూన్ ట్రిప్
అటు మనోజ్, ఇటు మౌనిక ఇద్దరికీ ఇది రెండో వివాహమే కావడం విశేషం.
మంచు మనోజ్ రెండో వివాహం సంగతి తెలిసిందే. దివంగత భూమా నాగిరెడ్డి-శోభా నాగిరెడ్డి కుమార్తె మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లాడారు. మార్చి 3వ తేదీన పెళ్లి చేసుకున్న ఈ జోడీ.. మరో మూడు రోజుల్లోనే హనీమూన్ ట్రిప్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల సమక్షంలో మనోజ్-మౌనికరెడ్డి మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.

ఇద్దరికీ రెండో వివాహమే..
అటు మనోజ్, ఇటు మౌనిక ఇద్దరికీ ఇది రెండో వివాహమే కావడం విశేషం. తమ తమ జీవితాల్లో రెండో సారి ఏడడుగులు వేసి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ హ్యాపీ మూమెంట్ బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కొత్త జంట ప్లాన్ చేసింది. లాంగ్ హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశారట మంచు మనోజ్.
మరో రెండు మూడు రోజుల్లోనే ఈ కొత్త జంట హనీమూన్ ట్రిప్ ప్రారంభం కానుందనే విషయం బయటకొచ్చింది. ముందుగా విదేశాల్లోని సుందరమైన రొమాంటిక్ ప్లేసెస్ చుట్టి వచ్చి ఆ తర్వాత ఇండియాలో కూడా ఎంజాయ్ చేసేలా ప్రణాళిక రచించుకున్నారట.

మాల్దీవులు వెళ్లనున్న జంట
మాల్దీవులు వెళ్లి అక్కడే ఓ వారం రోజులు స్టే చేయబోతున్నారు. ప్రపంచంలో ఉన్న పలు పర్యాటక, అందమైన సుందర ప్రదేశాలన్నీ చూసివచ్చేలా లాంగ్ షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నారు. పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంటకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
హైదరాబాద్ ఫిలిం నగర్ లోని మంచు లక్ష్మి ఇంట్లో మంచు మనోజ్ వివాహం జరిగింది. తమ్ముడి పెళ్లికి పెద్దగా ఆమే వ్యవహరించారు. మనోజ్ ను పెళ్లి కొడుకును చేయడంతో పాటు మౌనిక మెడలో మూడు ముళ్ళు వేసేవరకు అన్ని బాధ్యతలు ఆమే తీసుకుంది.

హాజరైన మోహన్ బాబు
టీడీపీ నేత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనికా రెడ్డి కావడంతో.. ఆమెను మోహన్ బాబు కోడలిగా స్వీకరించడానికి అంగీకరించలేదని తొలుత పలురకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ వాటికి చెక్ పెడుతూ తన చిన్న కొడుక్కిచ్చి రెండోపెళ్లి జరిపించారు. వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
అయితే మంచు విష్ణు మాత్రం చుట్టం చూపుగా అలా వచ్చి ఇలా వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది. దీనివెనక ఏమైనా కారణాలున్నాయా? అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. చు మనోజ్ మొదటి భార్య పేరు ప్రణతి రెడ్డి.
2015 లో ఆమెను వివాహం చేసుకున్న మంచు మనోజ్.. నాలుగేళ్లు కాపురం చేసి 2019లో విడాకులు తీసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అంగీకారంతో విడాకులిచ్చుకున్నారు. మూడేళ్లకు అనగా 2023 మార్చిలో భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications