TTD: తిరుమలలో ప్రత్యేక పర్వదినాలు, భక్తులకు పండగే పండగ
తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వివాదం చెలరేగిన సమయంలో ప్రతి విషయంలో టీటీడీ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరుమలకు వచ్చి వెళ్లే భక్తులు టీటీడీపైన ఎలాంటి ఆరోపణలు చేయకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కంట్ డౌన్ మొదలైంది. ఈనెల మూడో తేదీ నుండి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
టీటీడీ ఈఓ శ్యామల రావు సంబంధిత అధికారులతో ఇప్పటికే అనేక సమావేశాలు నిర్వహించి సంబంధిత అధికారులతో చర్చించారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేశారు. తిరుమాడ వీధుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీలో భక్తులు బస చెయ్యడానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

తిరుమాడ వీధుల్లోని గ్యాలరీల్లో బస చేసే శ్రీవారి భక్తులకి అల్పాహారం, పాలు, మజ్జిగ, అన్నప్రసాదాలు సరైన సమయంలో అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈఓ శ్యామలరావు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ. శ్రీవారి సేవలో తరిస్తున్న భక్త మండలి సభ్యుల సహకారం తీసుకోవాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. టీటీడీ, అగ్నిమాపక, అటవీ శాఖ, రెవిన్యూ, విజిలెన్స్, పోలీసు శాఖతో పాటు తదితర సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని టీటీడీ ఈఓ శ్యామల రావు సంబంధిత అధికారులకు సూచించారు.
తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఒక్కరు కూడా అసంతృప్తితో తిరుమల కొండ దిగకూడదని, ప్రతి భక్తుడిని సంతోషపరిచే పంపించాలా అధికారులు, సిబ్బంది పని చేయాలని టీటీడీ ఈఓశ్యామలరావు అధికారులకు సూచించారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్లే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు, టీటీడీ సిబ్బంది సూచించిన ప్రాంతాల్లోనే భక్తులు వారి వాహనాలు పార్కింగ్ చేయాలని టీటీడీ అధికారులు మనవి చేస్తున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో విద్యుత్ దీపాలంకరణతో పార్కులు, తిరుమలలోని అన్ని సర్కిల్స్ అందంగా అలంకరిస్తున్నారు. కలియుగ వైకుంఠ దైవం వెంకటేశ్వరుడు కొలువుతీరిన తిరుమలలో అక్టోబర్ నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి.

-
* 3వ తేదీన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
* అక్టోబరు 4వ తేదీన ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
* అక్టోబరు 8వ తేదీన శ్రీవారి గరుడసేవ
* అక్టోబరు 9వ తేదీన శ్రీవారి స్వర్ణరథోత్సవం
* అక్టోబరు 11వ తేదీన రథోత్సవం
* అక్టోబరు 12వ తేదీన శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమాప్తి
* అక్టోబరు 13వ తేదీన శ్రీవారి బాగ్ సవారి ఉత్సవం -
* అక్టోబరు 28వ తేదీన సర్వ ఏకాదశి
* అక్టోబరు 31వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం












Click it and Unblock the Notifications