మ్యాచ్ ఓవర్: కిరణ్‌కు డిఎస్ వార్న్, రోజుకోరకంగా జగన్

స్కోరు బోర్డు పైన స్కోరు స్పష్టంగా కనిపిస్తోందని, ఆట ముగిసిందని తన అల్లుడు శ్రీధర్ బాబు స్పష్టంగా చెప్పారని అన్నారు. వ్యవస్థను చెడగొట్టాలని చూస్తే పరిణామాలు మరో రకంగా ఉంటాయని హెచ్చరించారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడిన వారే నేతలు అవుతారన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిది యూ టర్నో క్యూ టర్నో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైఖరి రోజుకో రకంగా మారుతోందని విమర్శించారు. తెలంగాణ నిర్ణయం జరిగిపోయినందున సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు.
ఒంటరిగా పోటీ: మేకపాటి
వచ్చే ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో అన్నారు. కాంగ్రెసు పార్టీతో తమ పార్టీ కుమ్మక్కయినట్లుగా జరుగుతున్న ప్రచారం సరికాదన్నారు. 2014లో సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయన్నారు.












Click it and Unblock the Notifications