చర్యకు ప్రతి చర్య ఉంటుంది - టీడీపీకి నాగబాబు కౌంటర్..!!
టీడీపీ, జనసేన పొత్తులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించటం లేదని పవన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. టీడీపీ తనతో సంప్రదించకుండా సీట్లు ప్రకటించటం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్..పోటీగా తమ పార్టీ పోటీ చేసే రెండు స్థానాలను ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. టీడీపీని టార్గెట్ చేస్తూనే ఈ ట్వీట్లు చేసారనే ప్రచారం మొదలైంది.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఎన్నికల వేళ పొత్తులపైన కొత్త చర్చ మొదలైంది. పవన్ పొత్తు కొనసాగుతుందని చెబుతూనే..తన పట్టు నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ పొత్తు ధర్మం పాటించటం లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యల పైన టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలోనే మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. చర్యకు ప్రతి చర్య ఉంటుందని న్యూటన్ సిద్ధాంతాన్ని ఆయన ఉటంకించారు. అయితే ఈ ట్వీట్ టీడీపీని ఉద్దేశించి చేసిందేనని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యలకు నాగబాబు ఈ ట్వీట్ చేసారా అనే చర్చ మొదలైంది. అయితే, తాజాగా మరో ట్వీట్ చేసారు.

Sharing what I'm familiar with. pic.twitter.com/iXMjzvEYFj
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 26, 2024
నేను పెట్టే ప్రతీ పోస్ట్ కి ఏదోక అర్ధం వుంటది అనుకోవద్దు కొన్ని సార్లు జస్ట్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తుంటాను,ఇవ్వాల Physics laws యే చేసాను రేపు ఇంకొన్ని పోస్ట్ చేస్తాను...
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 26, 2024
Note :
( వీటి గురించి ఆలోచించి గుమ్మడి కాయల దొంగలు అవ్వొద్దు) pic.twitter.com/SBezdCj76g
తొలి ట్వీట్ పైన చర్చ సాగుతున్న వేళ నాగబాబు చేసిన మరో ట్వీట్ మరింత ఆసక్తి కరంగా మారింది. అందులో..నేను పెట్టే ప్రతీ పోస్ట్ కి ఏదోక అర్ధం వుంటది అనుకోవద్దు కొన్ని సార్లు జస్ట్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తుంటాను,ఇవ్వాల Physics laws యే చేసాను రేపు ఇంకొన్ని పోస్ట్ చేస్తాను... Note :( వీటి గురించి ఆలోచించి గుమ్మడి కాయల దొంగలు అవ్వొద్దు) అంటూ ట్వీట్ చేసారు. దీంతో మరిన్ని ట్వీట్లకు నాగబాబు సిద్దంగా ఉన్నారనే విషయం స్పష్టం అవుతోంది. అయితే, టీడీపీతో పొత్తు కొనసాగిస్తూనే ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేసేలా మెగా బ్రదర్స్ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో, సీట్ల ప్రకటన వేళ టీడీపీ, జనసేన పార్టీలో చోటు చేసుకొనే పరిణామాల పైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications