మెగా డీఎస్సీ టీచర్లపై ఒత్తిడి..జర్నలిజం ముసుగులో బెదిరింపులా?

మెగా డీఎస్సీ (Mega DSC) ద్వారా ఇటీవల ఉద్యోగాలు సాధించి పాఠశాలల్లో అడుగుపెట్టిన కొత్త ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.తమను జర్నలిస్టులుగా చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు తమ వద్దకు వచ్చి బెదిరింపులకు దిగుతున్నారని,అనుకూల స్టేట్‌మెంట్లు ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారని ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.వార్తలు సేకరించడం మానేసి,ఉద్యోగులపై భౌతిక,మానసిక ఒత్తిడి తీసుకురావడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఆధారాలతో నిలదీయాలి కానీ బెదిరింపులేంటి?

ఏళ్ల తరబడి కష్టపడి,రోజుకి పది పన్నెండు గంటలు శ్రమించి పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను ఈ రకంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.నియామక ప్రక్రియలో ఏవైనా అక్రమాలు జరిగాయని అనుమానం ఉంటే,తగిన ఆధారాలు,పత్రాలు,అధికారిక రికార్డులతో ప్రశ్నించడం పత్రికా స్వేచ్ఛ పరిధిలోకి వస్తుంది.కానీ, "నీకు అక్రమ మార్గంలోనే ఉద్యోగం వచ్చిందని ఒత్తిడి చేసి చెప్పించడం" జర్నలిజం విలువలకు పూర్తిగా విరుద్ధమని కొందరు సీనియర్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజంగా తప్పు జరిగి ఉంటే ఆధారాలతో సహా బాహ్య ప్రపంచానికి బయటపెట్టాలి తప్ప,కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిని భయభ్రాంతులకు గురిచేసి స్టేట్‌మెంట్లు తీసుకోవడం సబబు కాదని వారు హితవు పలుకుతున్నారు.

mega-dsc-row-are-new-teachers-being-threatened-in-the-name-of-journalism

నిజమైన జర్నలిజం స్ఫూర్తిని కాపాడాలి:
ఒక ఉద్యోగి తాను పడిన శ్రమను,తనకు ఉద్యోగం వచ్చిన విధానాన్ని వివరించడం వేరు.కానీ కొందరు వ్యక్తులు తమ రాజకీయ లేదా స్వార్థ ప్రయోజనాల కోసం "అక్రమంగా ఉద్యోగం పొందినట్లు ఒత్తిడితో చెప్పించే" ప్రయత్నం చేయడం వృత్తి ధర్మానికే మచ్చ తెచ్చే అంశంగా వారు అభివర్ణిస్తున్నారు.బెదిరింపుల ద్వారా స్టేట్‌మెంట్లు రాబట్టడం చట్టరీత్యా నేరం మాత్రమే కాక,బాధ్యతాయుతమైన రిపోర్టింగ్‌కు ఏమాత్రం తగదని హెచ్చరిస్తున్నారు.

వార్తా సేకరణ పేరుతో కొత్తగా విధులు ప్రారంభించిన ఉపాధ్యాయులను మానసిక ఆందోళనకు గురిచేసే చర్యలను తక్షణమే నిలిపివేయాలని పలువురు సీనియర్ జర్నలిస్టులు సలహా ఇస్తున్నారు. ఆధారాలు ఉంటే చట్టపరమైన వేదికలపై,ప్రజల ముందు పెట్టాలే తప్ప...శ్రమించి ఉద్యోగం సాధించిన వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే యత్నాలను విద్యావేత్తలు,సమాజం ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+