పవన్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధిగా చిరంజీవి-ప్రత్యేక హోదాలో..!
ఏపీలో ఈసారి కూటమి ఏర్పాటుతో పాటు ఎన్నికల్లో ఘన విజయం దిశగా నడపడంలో కీలక పాత్ర పోషించిన జనసేనాని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం వద్ద జరిగే చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులకు ఆహ్వానాలు అందుతున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ సోదరుడైన చిరంజీవిని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అతిథి హోదాలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఆహ్వానం లభించింది. దీంతో ఆయన ఇవాళే బయలుదేరి విజయవాడ చేరుకోబోతున్నారు. సాయంత్రం కల్లా విజయవాడ చేరుకుని రాత్రికి ఇక్కడే బస చేయబోతున్నారు. రేపు ఉదయం ప్రమాణస్వీకారానికి చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరు కాబోతున్నారు. దీంతో చిరంజీవి రాక ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈసారి ఎన్నికల్లో తన సోదరుడు పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని, కూటమిని గెలిపించాలని చిరంజీవి గతంలో వీడియో సందేశం ద్వారా పిలుపునిచ్చారు. ఆ తర్వాత పవన్ కుటుంబ సభ్యులు కూడా పవన్ తో పాటు ఇతర కూటమి అభ్యర్ధుల గెలుపు కోసం పలు చోట్ల ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో పవన్, చిరు కుటుంబ సభ్యులకు రేపు ప్రత్యేక ఆహ్వానం అందించడంతో పాటు ప్రత్యేక ఆతిథ్యం కూడా ఉంటుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications